ఘోర ప్ర‌మాదం.. 55 మంది దుర్మ‌ర‌ణం

- Advertisement -

తైవాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 55 మంది దుర్మ‌ర‌ణం పాలయ్యారు. టోరోకో జార్జ్ స‌మీప ప్రాంతంలో చోటుచేసుకున్నఈ ప్రమాదంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 55 మంది చ‌నిపోగా.. ప్ర‌మాదం జరిగిన చోటే అక్క‌డిక‌క్క‌డే 42 మంది చ‌నిపోగా.. మిగ‌తా వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచార‌ని స్థానిక మీడియా పేర్కొంది. ఇప్ప‌టికీ ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

సొరంగ మార్గంలో ప‌ట్టాలు త‌ప్ప‌డంతో బోగీలు చెల్లా చెదురుగా ప‌డిపోవడంతో ప్రాణ‌న‌ష్టం అధికంగా చోటుచేసుకుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదంలో 100 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్టు తెలిపారు. తైవాన్ రాజ‌ధాని తైపీ నుంచి టైటాంగ్ వెళ్తుండగా.. హోలియన్ కౌంటీ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదం.. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో రైల్వే మెయింటెనెన్స్ ట్రక్ ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో.. ఓ ట్రక్కును ఢీకొట్టి రైలు పట్టాలు తప్పింద‌ని అధికారులు వివ‌రించారు.

- Advertisement -

రైలు ప్ర‌మాద స‌మ‌యంలో అందులో 500 మంది వ‌ర‌కు ప్రయాణికులు ఉన్నార‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో మృత దేహాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టి క్ష‌త‌గాత్రుల‌ను ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలు ప్ర‌మాదాల్లో ఇది ఒక‌టిగా నిలిచింది.

రాత్రి నిద్రపోయే టైంలో ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

సమ్మర్ స్పెషల్: సోంపు గింజల కూల్ డ్రింక్.. ప్రయోజనాలెన్నో !

కరోనా కల్లోలం.. మూడో సారి లాక్‌డౌన్.. !

అద‌ర‌గొడుతూ.. దూసుకుపోతున్న అందాల నిధి

ఏంటీ ఈ కోతలు.. కేంద్రంపై ఎర్ర‌బెల్లి ఫైర్ !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -