రక్తం రుచి మరిగిన పెద్దపులి.. మరింత వేటలో అధికారులు!

- Advertisement -

అసలే కరోనా వైరస్ తో నానా కష్టాలు పడుతున్న సమయంలో బర్డ్ ఫ్లూ అంటూ బెంబేలెత్తిస్తుంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు కొమురం భీం జిల్లా కంది భీమన్న అటవీప్రాంతంలో రక్తం రుచి మరిగిన పెద్దపులి కలకలం సృష్టిస్తుంది. ఇద్దరు గిరిజనులను ఈ పులి పొట్టన పెట్టుకుంది. మనుషులు, జంతువు దీనికి ఆహారం అయ్యారు. ఈ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పలు ప్రాంతాల్లో ఎరలు ఏర్పాటు చేసినా, ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఆ ఎరలకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది.

టైగర్ ట్రాకర్లు, రెస్క్యూ బృందాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు, వైద్య బృందాలతో కంది భీమన్న అటవీప్రాంతం అధికారులు జల్లెడ పడుతున్నారు. మొత్తం 150 మంది ఈ పులి వేటలో నిమగ్నమయ్యారంటే దీని ప్రభావం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

- Advertisement -

అయితే రాత్రివేళల్లో జంతువులపై మత్తు మందు ప్రయోగించడానికి నిబంధనలు అంగీకరించవు.. అయినా రాత్రి వేళల్లో పులిని బంధించడం కూడా కష్టమే అంటున్నారు. ఇక్కడి అటవీప్రాంతంలో ఎత్తయిన మంచెలు ఏర్పాటు చేసుకుని పులి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News