పులివెందులో దారుణం..ప్రియురాలిని కత్తితో దాడి చేసి చంపిన ప్రియుడు

- Advertisement -

కడప జిల్లా పులివెందులో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని ప్రియుడు కత్తితో దాడి చేసి చంపాడు. మహిళను హర్హవర్ధన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి చంపాడు. మహిళను నిందితుడు ఎందుకు చంపాడు ? నిందితునికి వివాహిత కుటుంబానికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా ? లేక హత్యకు వివాహేతర సంభందం ఏమైనా ఉందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మృతురాలు అనంతపురం జిల్లా ఎస్‌కే కాలువకు చెందిన రిజ్వాన. రిజ్వానకు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన సర్దార్‌తో వివాహమైంది. వివాహ అనంతరం రిజ్వాన, హర్షవర్దన్ అనే వ్యక్తితో అక్రమ సంభందం పెట్టుకుంది.

- Advertisement -

గతంలో విళ్లు ఇద్దరు బెంగళూరుకు పారిపోయారు. రిజ్వాన కనపడక పోవడంతో తన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు వివాహిత ప్రియుడితో కలిసి బెంగళూరులో ఉంటుందని తెలుసుకొని తనను అనంతపురం తీసుకువచ్చారు. అనంతరం మహిళకు సర్ధిచెప్పిన కుటుంబ సభ్యులు రిజ్వానను అత్తవారింకి పంపించారు. అప్పటి నుంచి రిజ్వాన, సర్దార్‌లిద్దరు జిల్లాలోని పులివెందులలో ఉంటున్నారు. తనను వదిలి వచ్చిందనే కోపం పెంచుకున్న హర్షవర్ధన్ ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న మహిళను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దారుణం..

ధ్వంసమైన తిరుమల ఘాట్ రోడ్డు..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -