- Advertisement -

క్రూరత్వం..కుక్కలను గొడకు కొట్టి చంపేసింది!

- Advertisement -

తమిళనాడులో జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఇద్దరు కుక్క పిల్లలను గోడకు కొట్టి చంపినట్లు సీసీటీవీ కెమెరాలో నమోదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ వీడియోను జంతు సంరక్షణ కార్యకర్త విదిత్ శర్మ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు.

మార్చి 4 తేదీతో ఉన్న ఈ సీసీటీవీ వీడియోలో ఒక ఆటోరిక్షా దగ్గర కొన్ని కుక్క పిల్లలు తిరుగుతూ కనిపిస్తున్నాయి. కొద్ది సేపటికి సమీపంలోని ఇంటి నుంచి ఒక మహిళ బయటకు వచ్చి ఆటో క్రింద ఉన్న ఒక కుక్కపిల్లను ఎత్తుకుని గోడకు బలంగా కొట్టింది. ఆ తర్వాత వెంటనే మరో కుక్కపిల్లను కూడా అదే విధంగా గోడకు కొట్టి చంపినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం ఆమె ఎలాంటి భావోద్వేగం లేకుండా అక్కడి నుంచి వెళ్లి తన ఇంట్లోకి చేరినట్లు తెలుస్తోంది.

విదిత్ శర్మ చేసిన పోస్టు ప్రకారం, ఆ మహిళకు ఎదురింట్లో నివసించే కుటుంబంతో వ్యక్తిగత వివాదం ఉన్నట్లు సమాచారం. ఆ వివాదం కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జంతు సంరక్షణ బృందం పోలీసులు కలిసి అక్కడికి వెళ్లినప్పుడు, ఆ మహిళ దాదాపు గంటపాటు తన ఇంట్లో తలుపులు వేసుకుని ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు.

తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆమె తన చిన్నారిని ముందుకు పెట్టుకుని ఎవరూ తనపై చర్యలు తీసుకోలేరనే ఉద్దేశంతో అలా వ్యవహరించినట్లు ఆరోపించారు. అలాగే మరో రెండు కుక్కపిల్లలను సమీపంలోని చెట్టుకు వేలాడదీసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టాల ప్రకారం ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -