- Advertisement -

మహిళపై వేధింపులు..అడ్డుకున్నందుకు!

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో అమానుషం చోటు చేసుకుంది. ఒక మహిళను వేధిస్తున్న వ్యక్తుల గుంపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారిపై దాడి జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దక్షిణ ఢిల్లీ లోని మెహ్రౌలి ప్రాంతంలో మహిళపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అడ్డుకునేందుకు ప్రయత్నించిన 26 ఏళ్ల వ్యాపారిని తీవ్రంగా కొట్టడంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఫిబ్రవరి 3న మెహ్రౌలి ప్రాంతంలో దాడి జరిగిందని పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముకేశ్ అనే వ్యక్తి గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించారు. అతడిని మొదట పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఆసుపత్రికి తరలించి, ఆ తర్వాత ప్రత్యేక చికిత్స కోసం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు మార్చారు.

ప్రాథమిక విచారణలో, నిందితులు ఓ యువతిని వేధిస్తున్నట్లు తెలిసింది. దీనిని గమనించిన రవాణా వ్యాపారవేత్త ముకేశ్ ఆ చర్యలను వ్యతిరేకించడంతో, ఆ గుంపు అతడిపై దాడి చేసి అక్కడి నుంచి పరారైంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సమన్వయంతో చేసిన చర్యల ద్వారా నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -