Monday, May 6, 2024
- Advertisement -

టీడీపీ చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏపీ సీఐడీ న్యాయస్ధానం. దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. వాదనల అనంతరం ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు అరెస్ట్‌ కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పేర్కొంది సీఐడీ. ఈ మొత్తం వ్యవహారంలో కుట్రదారు చంద్రబాబేనని ఆయనకు తెలిసే అంతా జరిగిందని సీఐడీ వెల్లడించింది. రూ.271 కోట్ల కుంభకోణంలో సూత్రధారి చంద్రబాబేనని వెల్లడించింది. అలాగే ఇక ప్రధారంగా రిమాండ్ రిపోర్టులో లో లోకేష్ పేరు ప్రస్తావించింది సీఐడీ. రిమాండ్ రిపోర్టులో లోకేష్,అచ్చెన్నాయుడు పేరును ప్రస్తావించింది సీఐడీ.

కిలారీ రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని…అలాగే చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు ముట్టాయని వెల్లడించింది. ఇక కుంభకోణంపై ఈడీ విచారణ జరుపుతోందని…ఇప్పటికే పలువురి అరెస్ట్ చేసిందని పేర్కొంది. ఈడీ విచారణ కీలక దశలో ఉందని పేర్కొంది…ప్రధానంగా వాంగ్మూలం ఇచ్చిన మనోజ్, శ్రీనివాస్‌ తమ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారని తెలిపింది. బాబే వీరిని కాపాడుతున్నారని వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -