- Advertisement -

టీడీపీకి బిగ్‌ షాక్‌..వైసీపీలోకి కీలక నేత?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీలో చేరనున్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం జలీల్ ఖాన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు జలీల్ ఖాన్.
ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత అయోధ్య రామిరెడ్డిని కలిశారు. దీంతో జలీల్ వైసీపీలో చేరడం ఖాయమనే తెలుస్తోంది.

విజయవాడ వెస్ట్ లో బలమైన మైనార్టీ నేతగా ఉన్నారు జలీల్ ఖాన్. గత ఎన్నికల్లో ఓడిపోయినా తన పట్టు నిలుపుకుంటూ వచ్చారు. అయితే ఈ సారి టికెట్ తనకేనని అనుచరులతో చెప్పుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లను కలిసి ఇదే విషయాన్ని చెప్పారు కూడా. అయితే ఆయనకు టికెట్ దక్కే పరిస్థితి లేదు.

దీంతో పార్టీ మారేందుకే జలీల్ ఖాన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. మొత్తంగా విజయవాడ పాలిటిక్స్ జలీల్ ఖాన్ ఎపిసోడ్‌తో హీటెక్కాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరగా ఆయనకే టికెట్ కన్ఫామ్ చేశారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -