Saturday, April 27, 2024
- Advertisement -

సీనియర్ల అలకపాన్పు..వాట్ నెక్ట్స్!

- Advertisement -

ఏపీ బీజేపీ సీనియర్లు అలకపాన్పు ఎక్కారు. ఎంపీ సీట్లు ఆశీంచి భంగపడ్డ సోమువీర్రాజు,విష్ణువర్ధన్ రెడ్డి,సత్యకుమార్,జీవీఎల్ నరసింహారావు ఇవాళ జరిగిన పదాధికారుల సమావేశానికి దూరంగా ఉన్నారు. దీంతో వీరి గైర్హాజరిపై పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.

విశాఖ సీటు కోసం మొదటి నుండి పట్టుబడుతున్నారు జీవీఎల్. అయితే ఈ సీటును టీడీపీకి కేటాయించగా అనకాపల్లి స్థానాన్ని ఆశీంచారు. జీవీఎల్, సీఎం రమేష్ మధ్య గట్టి పోటీ నెలకొనగా బీజేపీ రమేష్‌కు ఈ సీటును కేటాయించింది. అలాగే రాజమండ్రి సీటు కోసం సోమువీర్రాజు తీవ్ర ప్రయత్నాలు చేయగా బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరికి ఈ సీటును ఇచ్చింది. ఇదే బాటలో విష్ణువర్థన్, సత్యకుమార్‌లు సైతం తమకు సీటు వస్తుందని ఆశీంచిన నిరాశ తప్పలేదు. దీంతో అప్పటినుండి పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

బీజేపీకి ఇచ్చిన ఆరు ఎంపీ స్థానాల్లో ఐదు ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే ఇచ్చారని బహిరంగంగానే వాపోయారు సీనియర్లు. పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందని,అలాగే పురందేశ్వరిపై విమర్శలు సైతం చేశారు. అసెంబ్లీ సీట్లలో కూడా ఇతర పార్టీల వారికే ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి రావడం వల్ల ఉపయోగం ఉండదని భావించి ఈ నలుగురు నేతలు డుమ్మా కొట్టారని వారి అనుచరులు చెబుతున్న పరిస్ధితి నెలకొంది. మొత్తంగా ఏపీ బీజేపీలో సీనియర్లు వర్సెస్ కొత్తగా వచ్చిన నేతల మధ్య పోటీతో పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయమని మరికొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -