- Advertisement -

లిక్కర్ కేసు..ఢిల్లీ హైకోర్టు సీబీఐ!

- Advertisement -

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మణీష్ సిసోడియా సహా 21 మందిని డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నిర్ణయించినట్లు సమాచారం.

ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మణీష్ సిసోడియా మరియు ఇతర 21 మందిని డిశ్చార్జ్ చేశారు. సీబీఐ చార్జ్‌షీట్‌ను స్వీకరించేందుకు నిరాకరిస్తూ, దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, ప్రాథమికంగా కేసు నిలబెట్టే సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. చార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని కూడా వ్యాఖ్యానించింది.

ఇప్పటికే రద్దు చేసిన ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. కోర్టు తీర్పు అనంతరం అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను నిజాయితీ గలవాడిని అని పేర్కొంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. సత్యానికి విజయం లభించింది. భారత న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. భగవంతుడు మనతో ఉన్నాడు అని అన్నారు. తాను ఆరు నెలలు ముఖ్యమంత్రిగా ఉండగానే జైలులో గడిపానని, సిసోడియా కూడా తప్పుడు కేసులో ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్నారని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -