- Advertisement -

పవన్ కళ్యాణ్‌కి ప్రొడ్యూసర్ చంద్రబాబే!

- Advertisement -

పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. పవన్ రాజకీయ ప్రయాణాన్ని ఉద్దేశిస్తూ, “పవన్ కళ్యాణ్‌కు ప్రొడ్యూసర్ చంద్రబాబు, కో–ప్రొడ్యూసర్ లోకేష్, కొత్త ప్రొడ్యూసర్ మోదీ” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పరిస్థితిపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేనకు ప్రచారం చేసినా డిపాజిట్లు కూడా రావని ముందే తెలిసి, పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “మా సెంటిమెంట్‌ను గాయపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్‌ను క్షమాపణలు చెప్పమని కోరినా ఆయన స్పందించలేదు” అని అన్నారు. అయినప్పటికీ, కొండగట్టు వచ్చినప్పుడు అతిథిగా గౌరవం ఇచ్చామని తెలిపారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే వారిని తాము గౌరవిస్తామని, కానీ అవమానించే మాటలను మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేస్తామంటే ఇక్కడి ప్రజలు ఊరుకోరని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఉందని, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారి భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాల నేతలు తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే ముందు ఇక్కడి ప్రజల భావాలను, సంస్కృతిని గౌరవించాలని సూచించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నటన మానేసి, వాస్తవాలను అర్థం చేసుకోవాలని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రజలకు స్పష్టత ఉందని, రాజకీయ నాటకాలతో ప్రజలను మభ్యపెట్టడం ఇక సాధ్యం కాదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -