- Advertisement -

అస్సాంలో బీజేపీ ఓడితే..వాట్ నెక్ట్స్!

- Advertisement -

అస్సాం అసెంబ్లీకి ఈ నెల 9న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 4న ఫలితాలు వెల్లడికానుండగా ఎవరు గెలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సీఎం హిమంత బిశ్వ శర్మ..ఎన్డీఏ కూటమి సెంచరీ కొడుతుందని ధీమా వ్యక్తం చేయగా కాంగ్రెస్ సైతం అధికారం తమదేనని తేల్చిచెబుతోంది.

ఒకవేళ అసోంలో ఓటమి ఎదురైతే, హిమంత బిస్వా సర్మా రాజకీయ భవిష్యత్తుపై పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి కీలక వ్యూహకర్తగా పేరుగాంచిన ఆయన, తన ప్రభావాన్ని జాతీయ స్థాయికి విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నారు.

ఒక వేళ అస్సాంలో బీజేపీ ఓడితే కేంద్ర మంత్రివర్గంలో లేదా జాతీయ స్థాయిలో బీజేపీలో కీలక బాధ్యతలు పొందే అవకాశాలు హిమంతకు లేనట్లే. అంతేగాదు పార్టీ అంతర్గతంగా ఆయన ప్రభావం తగ్గే అవకాశం ఉంది. అలాగే మోదీ ఈశాన్య వ్యూహానికి సవాలు ఎదురుకానుంది.

ప్రధానమంత్రి మోదీ.. “Act East” విధానంలో అసోంను కీలక రాష్ట్రంగా భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలను “అష్టలక్ష్మి”గా అభివర్ణిస్తూ పెట్టుబడులకు పెద్దపీట వేశారు. అయితే బీజేపీ ఓడితే ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం తగ్గే ప్రమాదం ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలపడటానికి అవకాశం ఉంది. గౌరవ్ గగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే, ప్రాంతీయ పార్టీలకు బలం చేకూరుతుంది. ఇది బీజేపీకి వ్యతిరేకంగా వ్యతిరేకత పెరిగిందనే సంకేతంగా భావించబడుతుంది.

ఈ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక ప్రజల గుర్తింపు, హక్కుల అంశాలు కీలకంగా మారాయి.

యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC)
NRC (National Register of Citizens) వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు సీఎం హిమంత బిశ్వ శర్మ.

ఓటమి జరిగితే..బీజేపీ యొక్క సాంస్కృతిక జాతీయవాద విధానం పట్ల ప్రజలు విరక్తి వ్యక్తం చేశారని అర్థం కావచ్చు.సంప్రదాయ కుల, వర్గ ఆధారిత రాజకీయాలు మళ్లీ బలపడే అవకాశం ఉంది. అసోం ఫలితాలు కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా బీజేపీ భవిష్యత్ వ్యూహాన్ని ప్రభావితం చేసే అవకాశముంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -