ఓ వైపుపై దాడులు మరోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అనైతిక రాజకీయాలు చేస్తోంది టీడీపీ కూటమి. రాజకీయ విలువలను పక్కనపెట్టి టీడీపీ, జనసేన నేతలు బెదిరింపులకు పాల్పడి మరి వైసీపీ నేతలను తమ పార్టీల్లోకి చేర్చుకుంటున్నారు. అయితే అలాంటి వారికి తగిన గుణపాఠం జరిగింది.
ఐదు రోజుల క్రితం వైసీపీని వీడి జనసేనలో చేరిన అనకాపల్లి జిల్లా యలమంచిలి జంపపాలెం ఎంపీటీసీ శిలపరశెట్టి ఉమ తిరిగి వైసీపీలో చేరారు. వైస్ ఎంపీపీగా ఉన్న ఉమ ఈనెల 8న జనసేన పార్టీలో చేరారు. పవన్ పార్టీలో చేరి ఐదు రోజులు కాక ముందే తిరిగి తమ సొంతగూటికి చేరుకున్నారు.
తమకు మాయమాటలు చెప్పి జనసేన పార్టీలో చేర్చుకున్నారని, ఇకపై తమ ప్రయాణం వైసీపీతోనే అని తేల్చి చెప్పారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. యలమంచిలి నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం కాగా ఈ సమావేశానికి హాజరయ్యారు ఉమా. మొత్తంగా ఐదు రోజుల వ్యవధిలోనే పార్టీ మారి తిరిగి సొంతగూటికి వచ్చిన గణేష్ – ఉమా దంపతుల ఎపిసోడ్‌పైనే స్థానికంగా చర్చజరుగుతోంది.
