Saturday, April 27, 2024
- Advertisement -

పెరిగిపోతున్న పవన్ బాధితులు?

- Advertisement -

ఏపీ ఎన్నికల్లో సమయం దగ్గర పడుతున్న కొద్ది పవన్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే పొత్తు నేపథ్యంలో జనసైనికులకు తీవ్ర అన్యాయం చేశారు పవన్. ఎందుకంటే జనసేన నుండి పోటీ చేయాలని ఎంతోమంది నేతలు భావించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారు పవన్. జనసేనానిని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని మండిపడుతున్నారు.

దీంతో పవన్ తీరును నిరసిస్తూ ఎంతోమంది జనసేను వీడారు. మరికొంతమంది రాజకీయాలపై అసహనంతో పాలిటిక్స్‌కు దూరమయ్యారు. ఇక తాజాగా విజయవాడ వెస్ట్ టికెట్‌ను ఆశీంచిన పోతన మహేష్…తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఐదు సంవత్సరాలు స్థానికంగా ఎన్నో పోరాటాలు చేశానని..కానీ ఇంతవరకు ఏడ్వలేదని, తన కళ్లలో నీళ్లు చూద్దామని కొందరు ఎదురుచూస్తున్నారన్నారు.

ఇక పవన్ తీరుపై పోతిన మహేశ్‌ మాత్రమే కాదు జగ్గంపేట ఇంఛార్జీ సూర్యచంద్ర,విడివాడ రామచంద్రరావు, కందుల దుర్గేశ్, పితాని బాలకృష్ణలాంటి అనేక మంది నేతలు ఇలా బాధితుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్‌ను బీజేపీకి కేటాయించడాన్ని ఇటు జనసేన నాయకులతో పాటు టీడీపీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 4 వేల ఓట్లు రాగా ఆ పార్టీకి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -