పందెం కోళ్ల కేసులో కేటీఆర్ బినామీగా పేరొస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారు? ఇవన్నీ నాకు తెలియనట్టు అనుకుంటున్నారా? నేను ఆడపిల్ల కదా అని లైట్ తీసుకుంటున్నారేమో… ఒక్కోక్కరి తోలు తీస్తా అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
ఇక మరోవైపు, టీ న్యూస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలకు కవిత లీగల్ నోటీసులు పంపారు. ఆధారాలు లేకుండా తనపై, తన భర్తపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నందున నోటీసులు పంపించానని ఆమె స్పష్టం చేశారు. వారంలోపుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తుందని నన్ను అంటున్నారు. అలా మాట్లాడే గుంటనక్కలకు చెప్తున్నా… నాపై అనవసర దాడి చేస్తే మీ చిట్టా మోత్తం విప్పుతా” అంటూ కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది నాయకుల అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. “ఇది జస్ట్ టాస్ మాత్రమే… అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది” అంటూ భవిష్యత్లో మరిన్ని రాజకీయ ఉద్వేగాలు రాబోతున్నాయన్న సంకేతాలు ఇచ్చారు.
