క‌రోనాతో క‌న్నుమూసిన న‌టుడు సతీష్ కౌల్

- Advertisement -

క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోతున్న ప్ర‌ముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్ర‌ముఖ న‌టుడు స‌తీష్ కౌల్ క‌రోనాతో పోరాడుతూ క‌న్నుమూశారు. ఇటీవ‌ల క‌రోనా బారిన‌ప‌డిన ఆయ‌న గ‌త వారం రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మించ‌డంతో ప్రాణాలు కోల్పోయారు. సినీరంగం ఆయ‌న మ‌ర‌ణంతో దిగ్భ్రాంతిని వ్య‌క్త చేస్తూ.. సంతాపం ప్ర‌క‌టించింది.

కాగా, స‌తీష్ కౌల్ 1954 సెప్టెంబర్ 8 న జ‌మ్మూకాశ్మీర్‌లో జన్మించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) 1969 బ్యాచ్‌లో గ్రాడ్యుయేష‌న్ చేశారు. బాలీవుడ్ నటులైన‌ జయ బచ్చన్, షత్రుఘ్న‌ సిన్హా, జరీనా వహాబ్, డానీ డెంజోంగ్పా, ఆశా సచ్‌దేవా, ఓం పూరి వంటి వారు ఎఫ్టీఐఐలో అతని బ్యాచ్ మేట్స్ కావ‌డం విశేషం.

- Advertisement -

బీఆర్ చోప్రా నిర్మించిన‌ మహాభారతంతో పాటు 300 కి పైగా చిత్రాలలో ఆయ‌న న‌టించారు. ఇందులో 85 చిత్రాల్లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. విక్రమ్ ఔర్ బేతాల్‌ అనే టెలివిజ‌న్ షోలలో న‌టించి బుల్లితెర‌పై త‌న‌దైన ముద్ర‌వేశారు. అయితే, కొన్ని అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న ఆర్థిక ప‌రిస్థితులు దారుణంగా మార‌డంతో ఇటీవ‌లే ఆర్థిక సాయం చేయాల‌ని సినీరంగంతో పాటు ప్ర‌భుత్వాన్ని కోరారు.

యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి

మాస్కు పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా: తెలంగాణ పోలీసులు

నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే మీకు ఆ రోగాలున్న‌ట్టే?

దేశంలో కరోనా పంజా.. కొత్తగా 1.45 లక్షల కేసులు

కరోనా.. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవ్: హైదరాబాద్ పోలీసులు

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -