Friday, April 19, 2024
- Advertisement -

మాస్కు పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా: తెలంగాణ పోలీసులు

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణ‌లోనూ క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా క‌ట్ట‌డికోసం అధికార యంత్రాంగం చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది. భౌతిక‌దూరం పాటించాల‌నీ, శానిటైజర్లు వాడాల‌నీ, బ‌య‌ట‌కు వ‌స్తే త‌ప్ప‌కుండా మాస్కులు ధ‌రించాల‌ని హైద‌రాబాద్ పోలీసులు గ‌త కొన్ని రోజులుగా ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగిస్తున్నారు.

అయితే, క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్న‌ప్ప‌టికీ.. ప‌లువురు మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డం, భౌతిక దూరం పాటించ‌కుండా ఉండటం స‌హా క‌రోనా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నారు. దీంతో పోలీసులు మ‌రింత క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. బ‌హిరంగంగా మాస్కులేకుండా ఏవ‌రైనా క‌నిపిస్తే.. వారికి రూ.1000 జ‌రిమానా విధిస్తున్నారు.

రోజు ఓ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో రెండు వేర్వేరు చోట్ల స్పెష‌ల్ డ్రైవ్ లు నిర్వ‌హిస్తూ.. మాస్కులు ధ‌రించ‌కుండా క‌రోనా నిబం‌ధ‌న‌లు ఉల్లంఘిస్తున్న వారికి జ‌రిమానాలు విధిస్తున్న‌ట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే, మాస్కులు ధ‌రించ‌కుండా తిరిగే వారి చిత్రాల‌ను సైతం సేక‌రిస్తూ.. ఆన్‌లైన్ మాధ్యంగా జ‌రిమానా ర‌సీదును అందిస్తున్నామ‌న్నారు. ఎవ‌రైనా జ‌రిమానా చెల్లించ‌కుంటే విప‌త్తు నిర్వ‌హ‌ణ చట్టంలోని సెక్షన్ 51 (ఏ) కింద వారిని కోర్టులో హాజరు పరుస్తామంటున్నారు.

నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే మీకు ఆ రోగాలున్న‌ట్టే?

దేశంలో కరోనా పంజా.. కొత్తగా 1.45 లక్షల కేసులు

కరోనా.. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవ్: హైదరాబాద్ పోలీసులు

ఎముక‌ల బలంకోసం వీటిని తినా‌ల్సిందే!

ఉత్కంఠభరితంగా ఐపీఎల్ తొలి మ్యాచ్… బెంగళూరు గెలుపు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -