దేశంలో కరోనా పంజా.. కొత్తగా 1.45 లక్షల కేసులు

- Advertisement -

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో నిత్యం ల‌క్ష‌కు పైగా కొత్త కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,45,384 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 1,32,05,926 కు పెరిగింది.

ఇక మ‌ర‌ణాలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన గడచిన 24 గంట‌ల సమయంలో 794 మంది వైర‌స్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,68,436కు పెరిగింది. ఇదే స‌మ‌యంలో కొత్త‌గా 77,567 మంది మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రిక‌వ‌రీల సంఖ్య 1,19,90,859కి చేరింది. ప్ర‌స్తుతం 10,46,631 మంది హోం క్వారంటైన్‌లు, ఆస్ప‌త్రుల్లో ఉండి చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

దేశంలో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా ప‌రీక్ష‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మరింత వేగ‌వంతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,52,14,803 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. శుక్ర‌వారం ఒక్క‌రోజే 11,73,219 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. కాగా, దేశంలో ఇప్ప‌టివ‌కు మొత్తం 9,80,75,160 మందికి వ్యాక్సిన్లు అందించారు.

కరోనా.. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవ్: హైదరాబాద్ పోలీసులు

ఎముక‌ల బలంకోసం వీటిని తినా‌ల్సిందే!

ఉత్కంఠభరితంగా ఐపీఎల్ తొలి మ్యాచ్… బెంగళూరు గెలుపు

క్రేజీ కాంభో.. చరణ్ మూవీలో సల్మాన్ !

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -