Friday, May 24, 2024
- Advertisement -

చంద్రబాబుతో ములాఖత్‌ల మతలబేంటీ?

- Advertisement -

రాజమండ్రి సెంట్రల్ జైలులోనే మరిన్ని రోజులు టీడీపీ అధినేత చంద్రబాబు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో బాబు తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ములాఖత్‌ల రూపంతో తాను ఏం చేయాలనుకుంటున్నారో చెప్పేస్తున్నారు. ఇప్పటికే బాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి,లోకేష్, బ్రహ్రాణి ములాఖత్‌లో భాగంగా చంద్రబాబును కలవగా ఆయన పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ములాఖత్ అనంతరం టీడీపీ నేతలతో భేటీ అయ్యారు భువనేశ్వరి,లోకేష్. తొలిసారిగా పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇవాళ చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు బాలకృష్ణ, నారా లోకేష్ ములాఖత్‌లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం ఉంది. చంద్రబాబుతో టీడీపీ నేతలు కలిశారంటే అర్ధం ఉంది కానీ పవన్ కళ్యాణ్ కూడా భేటీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బాబుతో ములాఖత్ తర్వాత ఈ ముగ్గురు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. తర్వాత పవన్ ఏం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పాలిటిక్స్‌లో పవన్ బాగా యాక్టివ్ అయ్యారు. బాబు అరెస్ట్‌ని నిరసిస్తూ రోడ్డుపై పడుకున్నారు కూడా. అంతేగాదు టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపుతో పాటు ధర్నాల్లో కూడా జనసేన నేతలు పాల్గొంటున్నారు. అయితే ఇంకా ఈ రెండు పార్టీల పొత్తు కన్ఫామ్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ ములాఖత్‌లో పొత్తుల అంశం ప్రస్తావనకు వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా జైలులో ఉన్నా చంద్రబాబు చేస్తున్న పాలిటిక్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -