- Advertisement -

ఎన్నికలకు ముందే తోకముడిచిన టీడీపీ అభ్యర్థి

- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు ముందే టీడీపీ అభ్యర్థికి తోకముడిచారు. ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న పి.గన్నవరం అభ్యర్థి సరిపెళ్ల రాజేష్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాస్తవానికి రాజేష్ పేరు ప్రకటించినప్పటి నుండి జనసేన, టీడపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనికి తోడు హిందూ సంఘాలు కూడా యాడ్ అవడంతో చివరకు ఎన్నికల పోరు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు మహాసేన రాజేష్‌.

రాజేష్‌కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ బ్రాహ్మణ సంఘ నాయకులు టీడీపీ కార్యలయాన్ని ముట్టడించారు. ఇక జనసేన కార్యకర్తలైతే టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఇంఛార్జీ హరీష్‌ మాధుర్ కారును ధ్వంసం చేశారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించలేక తానే పోటీ నుండి తప్పుకున్నారు.

గతంలో హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజేష్‌. ఆయనపై పలు స్టేషన్లలో పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఇక రాజేశ్‌ వ్యవహారశైలీ ఎప్పుడూ వివాదాస్పదమే. అందుకే ఆయనకు టికెట్ వచ్చినా పోటీ చేయలేని పరిస్థితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -