Saturday, April 27, 2024
- Advertisement -

రైతు ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి..

- Advertisement -

అన్నదాతలను మోసం చేసిందే టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు సీఎం జగన్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును విడుదల చేశారు జగన్. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని అందుకే రైతు భరోసా ద్వారా సాయం చేస్తున్నామని చెప్పారు.

పంట రుణాలను తీసుకుని క్రమం తప్పకుండా చెల్లించిన రైతులకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా జమచేశామని తెలిపారు జగన్.
రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మాట తప్పారన్నారు. రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన సున్నా వడ్డీని కూడా తామే చెల్లించామన్నారు.

వివిధ పథకాల ద్వారా రైతన్నల సంక్షేమం కోసం ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని .. ఐదేళ్లలో తాము రైతు భరోసా కింద రూ.34,228 కోట్లు రైతులకు సాయం అందించామన్నారు. రైతుల మేలు గురించి ఆలోచించే రైతు ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మించి రైతులకు సహాయం చేశామని… పగటిపూటే రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చామని తెలిపారు. ఉచిత విద్యుత్ కు ఏటా 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని…రైతులకు ఏ కష్టం వచ్చినా జగనన్న ఉన్నారని మర్చిపోవద్దన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -