Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్నికల వేళ జగన్‌ కీలక నిర్ణయం!

- Advertisement -

ఏపీ ఎన్నికల వేళ జగన్ కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం చూపగా మరోవైపు ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. ఆరోగ్య శ్రీ లబ్దిదారుల ఉచిత చికిత్స విలువను రూ. 25 లక్షలకు పెంచారు. ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 5లక్షల వరకు మాత్రమే ఉండగా దానిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు జగన్. డిసెంబర్ 18 నుండి ఇది అమల్లోకి రానుండగా అనంతరం కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేపట్టనున్నారు.

ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో ఐదు గ్రామాలను ఎంపిక చేయగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జనవరి నెలాఖరు వరకు జరగనుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కింద జనవరి 1 నుంచి వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.

ఇక ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వాసుల కిడ్నీ సమస్యల పరిష్కారానికి రూ. 700 కోట్లతో వైయస్సార్ సుజలధార ప్రాజెక్టును నిర్మించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు జగన్. అలాగే రూ.85 లక్షలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను నిర్మించారు. దీని ద్వారా బాధితులకు చికిత్సతో పాటు సమస్య ఎందుకు వచ్చింది అనే కారణాలపై పరిశోధన చేస్తారు. ప్రతి ఆసుపత్రిలోనూ 37 రకాల మందులను ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -