Saturday, May 11, 2024
- Advertisement -

సింగిల్‌గానే…పాలేరు లేదా మిర్యాలగూడ!

- Advertisement -

కాంగ్రెస్‌లో షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి బ్రేక్ పడింది. దీంతో ముందుగా హెచ్చరించినట్లుగానే సింగిల్‌గా అన్ని స్ధానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు షర్మిల. ఇవాళ నిర్వహించబోయే పార్టీ కార్యవర్గ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ, కాంగ్రెస్‌లో పార్టీ విలీనానికి అడ్డుపడింది ఎవరు అనే దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక వైఎస్‌ఆర్‌టీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు షర్మిల పాలేరులో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా మిర్యాలగూడ పేరు తెరపైకి వచ్చింది. పాలేరు లేదా మిర్యాలగూడ రెండింటిలో ఏదో ఒక స్ధానం నుండి లేదా రెండు స్ధానాల నుండి బరిలో దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్ పడటంతో తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు షర్మిల. ఇవాళ జరిగే భేటీలో ఆశావాహుల నుండి దరఖాస్తు స్వీకరించే ప్రక్రియతో పాటు తొలి దశలో పోటీచేసే అభ్యర్థుల లీస్ట్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై షర్మిల చాలా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని దురుచూశారు కానీ తీరా ఎన్నికల షెడ్యూల్ రావడం, కాంగ్రెస్ పట్టించుకోని ధోరణిలో ఉండటంతో గత్యంతరం లేక సింగిల్‌గానే బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు షర్మిల. నేటి సమావేశంలో ఎన్నికల కార్యాచరణ, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి? రాజకీయ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -