పవన్‌ కళ్యాణ్ ఒక వ్యసనం.. నవ్వులు పూయిస్తున్న బండ్ల గణేశ్‌ స్పీచ్‌

- Advertisement -

వెంకన్నకు అన్నమయ్య, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవర్ స్టార్ కు బండ్ల గణేశ్‌ అని సగర్వంగా చెప్పుకుంటా.” అన్నారు నిర్మాత బండ్ల గణేశ్‌. అంతే కాదు పవన్‌ కల్యాణ్‌కు ఎంత పొగరుందో కూడా తనదైన స్టైల్లో వివరించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికగా ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న బండ్ల గణేశ్‌ తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్‌పై అభిమానాన్ని చూపిస్తూ మాటలను తూటాలుగా పేల్చారు.

‘పవన్‌ కళ్యాణ్ నిజంగా ఒక వ్యసనం. ఒకసారి అలవాటు చేసుకుంటే చచ్చి బూడిదయ్యే వరకు మనం వదల్లెం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఐపీఎస్ వద్దకు వెళ్లి టెన్త్ క్లాస్ బాగా పాస్ అయ్యారు అన్నట్టు ఉంటుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ చూడని బ్లాక్‌ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, చరిత్రలు లేవు. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి పవన్‌ కల్యాణ్‌కి బాగా పొగరు. ఎవరని మాట్లాడనీయకుండా వెళ్లాడు అన్నాడు. అప్పుడు నేను చెప్పా.. అవును పవన్‌ కల్యాణ్‌ ఎంత పొగరంటే.. పాక్ గడ్డమీద ఆ సైనికులకు దొరికి చిత్ర హింసలు పెట్టినా మన దేశ రహస్యాలు చెప్పని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసంకట్టుకు ఉన్నంత పొగరు ఆయన ఉందని చెప్పా.

- Advertisement -

చైనాతో యుద్ధంలో ఫిరంగి ట్రిగ్గర్ నొక్కబోయే భారత సైనికుడికి ఉన్నంత పొగరు ఉందని చెప్పా. ఛత్రపతి శివాజీ కత్తికి ఉన్న పదునంత పొగరు అని చెప్పా. బ్రిటీష్ సామ్రాజ్యపు జెండా దించేసి, ఎర్రకోట మీద ఎగిరిన మువ్వన్నెల జెండాకున్నంత పొగరుందని చెప్పా. భారత రాజ్యాగంలో అంబేద్కర్ చేతి రాతకున్నంత పొగరుందని చెప్పా. యవ్వనంలో దేశం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తిలో ఉన్నంత పొగరుందని చెప్పా. పరశురాముడి గొడ్డలికున్నంత పదును, శ్రీరాముడు విడిచిన బాణంలోని పదునంత పొగరుందని చెప్పా. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రంలోని పదునంత పొగరుందని చెప్పా. అన్నింటికంటే జై పవర్ స్టార్ అని అరిచే అభిమాని గుండెకున్నంత పొగరుందని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్.’ అంటూ పవన్ అంటే ఎంత అభిమానం అనేది ఓ రేంజ్ లో చెప్పుకొచ్చాడు.

ఇంతటితో ఆగని బండ్ల.. ఊరికే ఎవరు గొప్పవాళ్ళు కారు.. ఎందరో పుడుతుంటారు.. చనిపోతుంటారు కానీ కొందరే చరిత్రలో ఉంటారు. రోజుకు అయన 18 గంటలు పని చేస్తూ… 1200 మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. నేను చాలాసార్లు పవన్ కళ్యాణ్‌కి అబద్దం చెప్పి మోసం చెయ్యాలని చూశాను.. కానీ అయన కళ్ళలోకి చూస్తే అలా చేయడం నా వల్ల కాదు.. అయన కళ్ళలో అంతా నిజాయితీ ఉంటుంది’అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. బండ్ల గణేష్ ప్రసంగం ఇస్తున్నంత సేపు పవన్ కళ్యాణ్, దిల్ రాజు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నారు. ప్రస్తుతం బండ్ల స్పీచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

తిరుపతిలో పవన్‌ సభ సక్సెస్‌, ఆనందంలో వైసీపీ!

కొండెక్కిన కోడి.. క‌రోనానే కార‌ణ‌మా?

ఇండోనేషియాలో వదర బీభత్సం.. 75 మంది మృతి

కరోనా టెర్రర్.. ఒకే రోజు లక్ష మందికి పాజిటివ్

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -