కమెడియన్ తో అనసూయ రొమాన్స్

- Advertisement -

బుల్లితెర మీద యాంక‌ర్‌గా రాణిస్తూనే అవ‌కాశం వ‌చ్చినప్పుడ‌ల్లా వెండితెర మీద కూడా త‌ళుక్కున మెరుస్తోంది అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు సుకుమార్‌, హీరో రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘రంగ‌స్థ‌లం’ చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించి అంద‌రినీ బుట్ట‌లో ప‌డేసింది. ఆ పాత్ర అన‌సూయ‌కు ఎన‌లేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. వ‌రుస ఆఫ‌ర్లు ఆమె త‌లుపు త‌ట్టాయి. దీంతో ఇటు షోలు చేస్తూ మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తూ బిజీబిజీగా మారిపోయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘థాంక్యూ బ్రదర్’‌ సినిమాలో నటిస్తోంది. అది కూడా గర్భిణిగా ఛాలెంజింగ్‌ రోల్‌ చేస్తోంది. మరోవైపు మెగా డాటర్‌ నిహారికతో కలిసి ఓ వెబ్‌సిరీస్‌ కూడా చేస్తోంది. తాజాగా అనసూయకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమెకు కమెడియన్‌ పక్కన హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ వచ్చిందట.

- Advertisement -

కమెడియన్ నుంచి హీరోగా మారిన సునిల్ తో అనసూయ రోమాన్స్ చేయబోతుందని టాక్. సునీల్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘వేదాంతం రాఘవయ్య’ సినిమాలో అతడికి జోడీగా నటించేందుకు అనసూయను ఒప్పుకుందట. కథ నచ్చడంతో పాటు, హీరోహీరోయిన్లు ఇద్దరికీ సమప్రాధాన్యత ఉండటంతో సదరు సినిమాలో నటించేందుకు ఆమె పచ్చజెండా ఊపినట్లు ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది.ఈ సినిమా కు హరీష్ శంకర్ కథ అందించగా కొత్త దర్శకుడు సి.చంద్రమోహన్ తెరకెక్కించనున్నాడు.

గుప్పెడన్ని సీన్లు.. చిరకాలం గురుతులు.

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...