10 ఏళ్ళ తర్వాత మహేష్ తో అనుష్క రొమాన్స్..!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తో సూపర్ హిట్ కొట్టి సంక్రాంతి రేసులో తనకంటూ ఓ రేంజ్ ఉందని తెలియజేశాడు. అనిల్ రావిపూడి లాంటి చిన్న డైరెక్టర్ తో ఇంత పెద్ద హీరో సినిమా చేయడం మహేష్ పెద్ద ధైర్యమే చేశాడని చెప్పాలి. నిజానికి మహేష్ లాంటి సూపర్ స్టార్ లు పెద్ద దర్శకులతో తప్ప సినిమా చేయరు. కానీ ప్రయోగాలకు దగ్గరగా ఉండే మహేష్ ఈ సినిమా చేసి పేరు తో పాటు హిట్ కూడా దక్కించుకున్నాడు.

ఈ సినిమా తర్వాత మహేష్ నుంచి సర్కార్ వారి పాట అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాని గీత గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మించబోతున్నాయి. ఇప్పటికే ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కథ పరంగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతుందట. ఈ పాత్ర సినిమాలో కీలకంగా ఉండబోతుందట.

- Advertisement -

అయితే తాజా సమచారం మేర హీరోయిన్ అనుష్క ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు రెమ్యూనరేషన్ విషయమై చర్చలు కూడా జరుగుతున్నటు ఇండస్ట్రీ టాక్. ఇది ఇలా ఉంటే 10 ఏళ్ళ క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఖలేజా సినిమాలో అనుష్క, మహేష్ బాబు కలసి జోడి కట్టిన విషయం తెలిసిందే. ఈ రోజే సర్కారు వారి పాట సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

’మిస్ ఇండియా’ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

మ‌రోసారి తెరపైకి శ్రీముఖి ల‌వ్ రిలేష‌న్ షిప్..?

అల్లుడు చైతన్య కి నాగబాబు ఎంత ఇస్తున్నారు తెలుసా..?

’మిస్ ఇండియా’ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...