హైపర్ ఆదికి కరోనా పాజిటివ్.. ఇంకా ఎవరికి వచ్చింది ?

- Advertisement -

జబర్దస్త్‌ షోను కరోనావైరస్ వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. జబర్దస్త్‌కు సంబంధించిన సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌కు కరోనావైరస్ పాజిటివ్ అనే వార్తలు వచ్చాయి. కమెడియన్ హైపర్ ఆది కూడా కరోనా బారిన పడ్డారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సుధీర్ కి కరోనా రావడం కంటే ముందే హైపర్ ఆదికి కూడా కరోనా సోకినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైపర్ ఆది ప్రస్తుతం కోలుకున్నట్టు సమాచారం. అయితే అధికారిక ఎవరూ ధృవీకరించకపోవడం వల్ల హైపర్ ఆది ఆరోగ్యం విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జబర్దస్త్ టీమ్‌లో పలువురికి ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో షూట్ ను వాయిదా వేశారట అని న్యూస్ వస్తోంది. కరోనా భయాలు వెంటాడుతున్న సమయంలో జబర్దస్త్ టీమ్‌తోపాటు పలు టెలివిజన్ ఛానెల్స్‌లో పనిచేసే నటీనటులు సాంకేతిక నిపుణులు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారట. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.

- Advertisement -

వారిలో నవ్యస్వామి, రవికృష్ణ, సింగర్ స్మిత, మాలవిక, సాక్షి శివ తదితరులు ఉన్నారు. తాజాగా రాజశేఖర్ కుటుంబం కూడా కోవిడ్ పాజిటివ్‌కు గురైన విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టిందకున్న సమయంలో స్టార్ కమెడియన్లు, సాంకేతిక నిపుణులు కరోనాకు గురికావడం ఆందోళనకు గురిచేస్తున్నది.

అమ్మ రాజశేఖర్ గుండు చూసి అతని భార్య ఏమన్నాదో తెలుసా ?

నటి వనితా మూడో పెళ్లి పెటాకులే.. భర్తను వెళ్ళగొట్టింది..!

కాజల్ పెళ్లికి నాకు ఏం సంబంధం లేదు : నవదీప్

ప్రభాస్ కి హీరోయిన్ దొరకడం లేదట..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...