ఛాన్స్ ఇస్తానని అమ్మా రాజశేఖర్ నన్ను వాడుకున్నాడు : జబర్తస్త్ పవన్

- Advertisement -

జబర్దస్త్ లో లేడీ గెటప్‌తో పాపులర్ అయ్యాడు పవన్. తన లైఫ్ లో జరిగిన షాకింగ్ విషయాలతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మా రాజశేఖర్ నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. పవన్ (పావణి) మాట్లాడుతూ.. తినడానికి తిండి లేని టైంలో మేస్త్రీగా కూడా పని చేశా. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తరువాత లేడీ గెటప్‌లు వేస్తున్నానని కొందరు హేళన చేశారు. నాకు వచ్చిన డాన్స్ ను నేర్పిస్తూ చాలా స్కూల్స్ లో పని చేశా. అయితే నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోవడానికి కారణం అమ్మా రాజశేఖర్ మాస్టర్.

అమ్మా రాజశేఖర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేవాడ్ని.. వాళ్లు వైఫ్ చాలా బాగా చూసుకునేవాళ్లు. అప్పుడు ఆయన రవితేజ గారితో ఖతర్నాక్ సినిమా చేస్తున్నారు. ఆ టైంలో ఆయన రేయ్ నిన్ను ఆర్టిస్ట్ చేస్తారా అనేవారు. అలా చెప్పడంతో నేను ఎక్కువ పని చేసేవాడ్ని.. ఆయన పర్సనల్ పనులు చేయడం.. తిండి, వంట అన్నీ నేనే చూసుకునేవాడిని. భార్య కంటే కూడా ఎక్కువ సేవలు చేశా. బట్టలు కూడా ఉతికి పెట్టేవాడిని.. అలసిపోయి వస్తే.. కాళ్లు పట్టేవాడిని. తలకి ఆయిల్ పెట్టేవాడిని.

- Advertisement -

నాతో అన్ని పనులు చేయించుకున్నారు. అయితే సినిమా మొదలు పెట్టినా తర్వాత.. మెల్లగా ఛాన్స్ అడగడం మొదలు పెట్టా. అప్పుడు ఆయన ‘రేయ్!! చెప్పిన పని చేయి.. నువ్ సినిమాల్లో చేస్తావా?? నీ ఫేస్ చూసుకున్నావా? అని చాలాసార్లు తిట్టాడు. నేను 10-15 సార్లు ఇలా తిట్లు తిన్నాను. ఖతర్నాక్ రిలీజ్ అయింది. తర్వాత నితిన్-సదాలతో ‘టక్కరి’ మొదలుపెట్టారు. అప్పుడు మళ్లీ అడిగాను. దానికి ఆయన సీరియస్ అయ్యారు.

రేయ్.. నువ్ పనిచేయడానికి వచ్చావు.. పనోడిలా ఉండు.. ఎక్కువ ఊహించుకోకు.. అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక అక్కడ ఉండొద్దని ఫిక్స్ అయ్యి బయటకు వచ్చాను. తర్వాత డాన్సర్‌గా కెరియర్ స్టార్ట్ చేశా.. డాన్సర్‌గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఢీ షోలో మధు అనే అమ్మాయికి అసిస్టెంట్‌గా చేశా.. చాలా మంది నువ్ పొట్టిగా ఉన్నావ్ అని హేళన చేశారు. నాకు ఢీలో ఛాన్స్ రాకపోవడంతో.. కొందరికి ఇంటికి వెళ్లి డాన్స్ నేర్పడం ప్రారంభించా. ఆ తర్వాత జబర్దస్త్‌కి రావడంతో లైఫ్ మారింది’ అని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు పవన్.

ఏమీ పీకలేక.. పీకే మీద పడి ఏడుస్తున్నావ్ : వర్మపై మాధవీలత ఫైర్

వైరల్ అవుతున్న బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్..!

అఖిల్ తో పెళ్లి కావాలంట.. విష్ణుప్రియ కోరిక.. రివీల్ చేసిన శ్రీముఖి..!

బిగ్ బాస్ 4 కోసం పూనమ్‌ బజ్వా ఎంత తీసుకుంటుందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -