ఇటివలే టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సోదరుడు, దివంగత నందమూరి జానకీరామ్ కుమారుల పంచెకట్టు పంక్షన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వేళంగిలో జరిగింది. ఈ పంక్షన్ కి హరికృష్ణ కుటుంబం మొత్తం హాజరయ్యారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు కళ్యాణ్‌రామ్ కూడా తన సతీసమేతంగా పిల్లలుతో కలిసి వచ్చారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ఈ పంక్షన్ కి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో అందరూ ఎంతో ఆనందంగా కనిపించి… మీడియాకు సైతం ఎంతో ఉత్సాహంగా స్టిల్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ అప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం కూడా చేసుకుని ఫొటోలకు పోజులు ఇచ్చేసారు. అయితే ఈ పంక్షన్ లో ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి మాత్రం ఒక్క ఫోటోలో కూడా నవ్వుతూ కనిపించలేదు.
ఈ కార్యక్రమం అయ్యే వరకు ఆమె చాలా సీరియస్‌గా ఉన్నట్టు కనిపించారు. మిగిలిన వారు కాస్తో కూస్తో నవ్వుతూ కనిపించిన ఆమె మాత్రం ఒక్కసారి కూడా నవ్వుతూ కనుపించలేదు. ఆ ఫంక్షన్‌లో ఎన్టీఆర్-ప్రణతి ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటోల్లో లక్ష్మీ ప్రణతి అంత సీరియస్ గా ఉండటానికి కారణం ఏంటీ? అనే సందేహాలు చాలా మందికి వచ్చాయి. ఎవరేమనుకున్నా లక్ష్మీ ప్రణతి ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటారు. ఆమె గతంలో ఇచ్చిన స్టిల్స్‌లో కూడా సీరియస్‌గానే ఉన్నట్లు కనిపించారు. ఇక ఆ ఫంక్షన్ విషయానికొస్తే జానకి రామ్ లేరు కాబట్టి, ఆ బాధతోనే అలా ఉండి ఉండవచ్చని ఇంకొందరు అంటున్నారు.
Related
