నేను ప్రెగ్నెంట్.. ఆయన నన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు: నటి

- Advertisement -

అలనాటి బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే టెలివిజన్ రంగంలో పలు పాపులర్ టీవీ సిరీస్‌లకు దర్శకత్వం వహించి ఎన్నో ఉన్నతమైన అవార్డులను పొందింది.నీనా గుప్తా బాలీవుడ్లోకి “అధర్షిలా”సినిమా ద్వారా పరిచయం అయింది. “వోహ్ చోక్రీకి “మూవీకి ఉత్తమ సహాయ నటిగా ఆమె జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అలాగే నీనా గుప్తా గాంధీ , మర్చంట్ ఐవరీ, కాటన్ మేరీ వంటి విజయవంతమైన అంతర్జాతీయ సినిమాల్లో కూడా తన సత్తా చాటింది.

నీనా గుప్తా వెండితెరపై ఎంత అద్భుతంగా రాణించిదో నిజజీవితంలో అంతకంటే ఎక్కువ ఆటుపోట్లను ఎదుర్కొది. మాజీ వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో సహజీవనం చేసి గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయారు నీనాగుప్తా.తర్వాత మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. తాజాగా నీనా గుప్తా తన ఆత్మకథ “సచ్‌ కహున్‌ తో”లో పలు ఆసక్తికర సంఘటనల గురించి తెలిపారు.

- Advertisement -

Also read:హైపర్ ఆదికి కించపరచడం, రెచ్చిపోవడం అలవాటు!

ఈ క్రమంలో తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఒకసారి నాస్నేహితుడు సతీష్‌ కౌశిక్‌ నాదగ్గరకు వచ్చాడు.దీని గురించి ఏం బాధపడకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పుట్టబోయే బిడ్డ మన బిడ్డ అవుతుంది. అని భరోసా ఇచ్చారు అని తెలిపింది అయితే తాను ఆపెళ్ళికి నిరాకరించిందని తర్వాత ఢిల్లీకి చెందిన అకౌంటెంట్‌ వివేక్‌ మెహ్రాను వివాహం చేసుకుంది. 2018 లో నీనా గుప్తా వెండితెరపై రీఎంట్రీ ఇచ్చి “వీరే డి వెడ్డింగ్” మరియు “బధాయ్ హో” వంటి సినిమాలతో తో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.

Also read:మా నాన్నని ఏరా.. ఒరేయ్ అంటా: జబర్దస్త్ నూకరాజు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -