ప్రభాస్ కు 100 కోట్ల రెమ్యునరేషన్ ?

- Advertisement -

ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తర్వాత క్లాస్, మాస్ సినిమాల‌తో అగ్ర ‌క‌థానాయ‌కుడిగా పేరు సంపాదించుకున్నాడు. మ‌రీ ముఖ్యంగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన బాహుబ‌లి, బహుబ‌లి-2 సినిమాల‌తో ప్ర‌భాస్ పేరు దేశంలోనే కాకుండా అంత‌ర్జాతీయంగా మారుమోగిపోయింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు దేశ వ్యాప్తంగా మార్కెట్ ఏర్ప‌డింది.

ఇటీవ‌ల వ‌చ్చిన సాహో సినిమా సైతం ఆయ‌న‌కు బాలీవుడ్ లో మంచి పేరు తీసుకువ‌చ్చింది. దీంతో ప్ర‌భాస్‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే నాలుగైదు పాన్ ఇండియా ప్రాజెక్టుల‌కు ఒకే చెప్పాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ పారితోషికం గురించి సినీ ఇండ‌స్ట్రీలో తెగ చ‌ర్చ న‌డుస్తోంది.

- Advertisement -

బాలీవుడ్ లో న‌లుగురైదుగురు బ‌డా హీరోలు మాత్ర‌మే ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటారు. ఈ జాబితాలో ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కూడా చేరాడ‌ని సిని వ‌ర్గాల టాక్. ఎందుకంటే ద‌క్షిణాదిన ప్ర‌భాస్‌కు మంచి మార్కెట్ ఉంది. అలాగే, ఉత్తరాదిన కూడా సూప‌ర్ ఫాలోయింగ్ ఉండ‌టంతో ఈ స్థాయిలో డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. ఇక రాధేశ్యామ్ సినిమా హిట్ అయితే గ‌న‌క మ‌రింత పెంచే అవ‌కాశ‌లున్నాయ‌ని టాక్ న‌డుస్తుంది.

షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !

‘అన్నాతే’ షూటింగ్ లో సూప‌ర్ స్టార్ ర‌జినీ

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

మ‌హా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -