న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు అడ్డుగా మారిన ‘చ‌లి’

- Advertisement -

కొత్త సంవ‌త్స‌రం వ‌స్తుంది అంటే చాలు యువ‌తి, యువ‌కులు ఎంజాయ్ చేస్తారు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేట్ చేసుకుంటారు. ప‌బ్‌లు ,రెస్టారెంట్స్, హోట‌ల్స్ కూడా కొత్త సంవ‌త్స‌రం నాడు ప్ర‌త్యేక ప్యాకేజిని ప్ర‌క‌టిస్తాయి. ఇక మందుబాబుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా. అయితే ఎవ‌రు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్న ,వాటికి అడ్డుప‌డుతుంది వాత‌వార‌ణం. అవును రెండు తెలుగు రాష్ట్రాల‌లో చలి తీవ్ర‌త చాలా దారుణంగా ఉంది. ప‌గటి ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి. ఎప్పుడు న్యూ ఇయ‌ర్ వేడుకుల‌ను ఘ‌నంగా చేసుకునే హైద‌రాబాద్ వాసులు సైతం చ‌లికి బ‌య‌టికి రావ‌టంలే భ‌య‌డిపోతున్నారు.

బైక్‌ల మీద తిరుగుతు న్యూ ఇయ‌ర్ ఎంజాయ్ చేద్దామ‌నుకున్న యువ‌త‌కు చ‌లి ఇబ్బందిగా మారింది. హైద‌రాబాద్‌లో ఉష్టోగ్ర‌త 10 డిగ్రీల క‌న్నా త‌క్కువుగా ఉండంటంతో ప‌గ‌లే బ‌య‌టికి రావ‌డానికి జంకుతున్నారు జ‌నాలు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. కొత్త రాజ‌ధానిలో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు చ‌లి అడ్డుగా నిలుస్తుంది. ఏది ఏమైన‌ప్ప‌టికి ఇంత చ‌లిలో సైతం కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం చెప్ప‌డానికి యూత్ రెడీగా ఉంది.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -