Saturday, April 20, 2024
- Advertisement -

కాసేపట్లో అంత్యక్రియలు.. తల్లి ఏడుపు విని లేచిన పిల్లాడు..

- Advertisement -

ఆ పిల్లాడు చనిపోయాడని భావించారంతా. ఒక్కగానొక్క కుమారుడు ఆరేళ్లకే చనిపోయాడని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. పిల్లాడి తల్లిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. ‘ఒక్కసారి లే నాన్న .. ఈ అమ్మ కోసం లేవు నాన్న’ అంటూ ఆ తల్లి రోధిస్తోంది. బంధువులు, ఊర్లో వాళ్లు ఆ తల్లిని ఓదారుస్తున్నారు. తల్లి మాత్రం కుమారుడిమీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. ఆ రాత్రంతా ఆమె ఏడుస్తూనే ఉంది.తెల్లవారింది.. పిల్లవాడి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లి ఇంకా ఏడుస్తూనే ఉంది.. ఆమె ఒంట్లో శక్తి కూడా అయిపోయింది. ఒక్కసారి లే నాన్న అంటూ మళ్లీ ఆ తల్లి విలపిస్తుంది.

పిల్ల వాడి మృతదేహం ఓ ప్లాస్టిక్​ సంచిలో కట్టిపడేసి ఉంది. అయితే ఒక్కసారిగా ఆ తల్లి షాక్​ అయ్యింది. ఎందుకంటే పిల్లవాడిలో కదలిక వచ్చింది. దీంతో వెంటనే ఓ ప్లాస్టిక్​ కవర్​ తీసేసింది. పిల్లవాడికి తన నోటితో శ్వాస అందించింది. గుండెల మీద గట్టిగా కొట్టింది. సడెన్​గా పిల్లవాడు కదిలాడు. వెంటనే ఆ పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు ఆ బాబును బతికించారు. ఎక్కడో సినిమాల్లోనూ, టీవీ సిరియల్​లోనో జరిగిన ఘటన కాదిది. హ‌ర్యానాలోని బ‌హ‌దూర్‌గ‌ఢ్ ప్రాంతంలో ఓ ఘటన జరిగింది.

Also Read: పిల్లలపై వ్యాక్సిన్​ ప్రయోగాలు సక్సెస్​..!

అసలు ఆ గ్రామ ప్రజలే కాదు.. మొత్తం దేశమే ఈ ఘటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంతకీ ఈ ఘటన సంబంధించిన వివరాలు..హ‌ర్యానాలోని బ‌హ‌దూర్‌గ‌ఢ్ ప్రాంతానికి చెందిన హితేష్‌, ఝాన్వి భార్యాభర్తలు. వారికి ఓ ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు ఉన్నాడు. ఇటీవల బాబుకు టైఫాయిడ్ వచ్చింది. దీంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. మే 26 న చనిపోయాడని డాక్టర్లు చెప్పటంతో ఝాన్వి కుప్పకూలిపోయింది.

ఒక్కగానొక్క కొడుకు కళ్లముందే కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధ పడ్డారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. తల్లి ఏడుపు విని పిల్లవాడిలో కదలిక వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆక్సిజన్​ అందించి వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఈ నెల 15న బాబు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

Also Read: చెక్కపెట్టలో కొట్టుకొచ్చిన పసికందు..! ఎక్కడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -