Friday, April 19, 2024
- Advertisement -

పిల్లలపై వ్యాక్సిన్​ ప్రయోగాలు సక్సెస్​..!

- Advertisement -

ప్రస్తుతం అందరికీ థర్డ్​వేవ్​ భయం పట్టుకున్నది. మొదటి వేవ్​లో వృద్ధులు, రెండో వేవ్​లో మధ్య వయసు వాళ్లు, యువకులకు కరోనా సోకింది కాబట్టి.. మూడో వేవ్​లో కచ్చితంగా చిన్నపిల్లలపైనే ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలకు వ్యాక్సిన్​ కూడా అందుబాటులో లేదు. ఇప్పటికే పిల్లలకు సంబంధించిన కరోనా వ్యాక్సిన్ల కోసం ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు సైన్స్​ ఇమ్యూనాలజీ పత్రికలో ఓ కథనం ప్రచురితం అయ్యింది. మోడెర్నా టీకా పిల్లలపై సత్ఫలితాలు ఇచ్చిందని ఈ కథనంలో పేర్కొన్నారు. మోడెర్నా టీకా పిల్లల మీద ప్రయోగించగా.. వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆఫ్రికా జాతికి చెందిన 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు ప్రయోగం చేయగా.. ఈ వ్యాక్సిన్​ సత్ఫలితాలు ఇచ్చిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జంతువులకు ప్రీక్లినికల్​​ మోడెర్నా, ఎంఆర్​ఎన్​ఏ టీకా అమెరికాకు చెందిన నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ అలెర్జీ అండ్​ ఇన్ఫెక్షియస్​ డిసీజెస్​ (ఎన్​ఐఏఐడీ) అభివృద్ధి చేసిన ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే దీనిపై మరింత ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Also Read : థర్డ్​వేవ్​.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్​ఫుల్​..!

మనదేశంలో ఇప్పటికే థర్డ్​వేవ్​ పై ఆందోళనలు నెలకొన్నాయి. మహారాష్ట్ర లో అక్కడక్కడా చిన్నపిల్లలకు కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆందోళన నెలకొన్నది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్​ పంపిణీ కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదు. చాలా మంది కోవిషీల్డ్​ మొదటి డోస్​ తీసుకొని రెండో డోస్​ కోసం వెయిట్​ చేస్తున్నారు. ఈ క్రమంలో చిన్నపిల్లలకు వ్యాక్సిన్​ సక్సెస్​ అయినా.. అది మనదేశంలో అందుబాటులోకి వచ్చి.. వ్యాక్సినేషన్​ చేసే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

Also Read: సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్​ ఫార్ములా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -