కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!

- Advertisement -

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్​.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్​ ఊపిరితిత్తులతో పాటు శరీరంలోని వేర్వేరు భాగాల మీద కూడా ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. లివర్​ మీద కూడా వైరస్​ ప్రభావం ఉంటుందని వారు నిర్ధారించారు. కరోనా వైరస్​తో మెదడులో ఉండే కణజాలంపై కూడా ఎఫెక్ట్​ పడుతుందని ఆక్స్​ఫర్డ్​ శాస్త్రవేత్తలు గుర్తించారు.

కరోనా బాధితులు రుచి, వాసనను కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు కారణం మెదడు మీద కరోనా వైరస్​ ప్రభావం ఉండటమేనని సైంటిస్టులు అంటున్నారు.చాలా మంది కరోనా బాధితులకు మెదడు సంబంధిత సమస్యలు తలెత్తాయి. కరోనా ప్రభావంతో మెదడు కణజాలాన్ని కూడా దీర్ఘకాలంలో కోల్పోయే ప్రమాదం ఉందని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చిచెప్పారు.

- Advertisement -

యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లోని యూకే బయోబ్యాంక్‌ నుంచి సేకరించిన సమాచారంపై నిర్వహించిన అధ్యయనంలో ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు ఈ విషయాన్ని కనిపెట్టారు.మొత్తం 782మందిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. కోవిడ్‌ సోకిన 394మందిని, సోకని 388మందిని వేరు చేసి పరిశోధనలు నిర్వహించారు.
కోవిడ్​ సోకిన వారిలో మెదడు మీద ప్రభావం ఎక్కువగా కనిపించింది.

ఇప్పటికే కరోనా బారిన పడ్డ వారికి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, గ్రీన్ ఫంగస్ వంటి వ్యాధులు వస్తుండగా, మరణాలు కూడా నమోదవుతున్నాయి. తాజాగా కరోనా వైరస్ తో మెదడు కణజాలంపై కూడా ఎఫెక్ట్ పడుతుందని తేలడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read This: ఆల్ఫా, డేల్టా వేరియంట్​ ఏదైనా.. కోవాగ్జిన్‌ అ సూపర్​..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -