Monday, May 6, 2024
- Advertisement -

తెలంగాణాలో ప‌ట్టుబ‌డింది ఏపీ ఇంటెలిజ‌న్స్ అధికారులే..ఏపీ డీజీపీ ఠాకూర్

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓవైపు అధికార టీఆర్ఎస్ దూసుకుపోతుందటే మరోవైపు మహాకూటమి సీట్ల సర్దుబాటులోనే ఇంకా బిజీగా ఉంది. ఇటీవల తెలంగాణ కరీంనగర్, ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్ డబ్బులు పంచుతూ, ఎన్నికలకు ప్రచారం చేస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఘ‌ట‌న‌పై వివ‌ర‌న ఇవ్వాల‌ని ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్‌కుమార్ ఏపీ డీజీపీకీ నోటీసులు పంపించారు. ఆ నోటీసుల‌కు డీజీపీ ఠాకూర్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఏపీ ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీతో చర్చించి ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని ఇచ్చినట్టు డీజీపీ సీఈఓ రజత్ కుమార్ కు రిప్లై ఇచ్చారు.

నోటీసులో పేర్కొన్నట్టుగా వారంతా తమ ఇంటలిజెన్స్ అధికారులేనని డీజీపీ స్పష్టం చేశారు. అయితే తమ ఇంటలిజెన్స్ అధికారుల వద్ద నగదు ఉందనేది తమ ఇంటలిజెన్స్ అధికారులు తెలంగాణకు వెళ్లారని ఆయన చెప్పారు. నిఘాలో భాగంగా ఇంటలిజెన్స్ సిబ్బంది ఎక్కడికైనా వెళ్లే హక్కుందని డీజీపీ గుర్తు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -