Monday, April 29, 2024
- Advertisement -

వ‌ర్షం సాక్షిగా   బ‌య‌ట‌ప‌డిన ప‌చ్చ‌మీడియా పైత్యం

- Advertisement -
AP CM chandrababu naiudu yellow media

చంద్ర‌బాబు డబ్బాకొట్టె ఆస్థాన ప‌చ్చ‌మీడియా చాన‌ల్లు ,ప‌త్రిక‌లు వైసీపీ అధినేత జ‌గ‌న్ సంబందించిన విష‌యాల‌లో చంక‌లు గుద్దుకొని వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తాయి.కాని అదే మీడియా కు టీడీపీ ప్ర‌భుత్వంగాని,నాయ‌కులు గాని ఏంచేసినా దాన్ని క‌ప్పిపుచ్చుతాయి.

అక్కడ విశాఖ పట్నంలో ఏకంగా 235 గ్రామాలకు సంబంధించిన రికార్డులు గల్లంతైనా, దాదాపు మూడు లక్షల కోట్ల విలువైన భూములను ఒక మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కలిసి కబ్జా చేశారని మిత్రపక్షం బీజేపీ ఆరోపిస్తున్నా సరే జాతి మీడియాకు అవి కనిపించవు.

{loadmodule mod_custom,GA1}

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే 12వందల కోట్లతో నిర్మించిన ఏపీ అసెంబ్లీలోకి జగన్‌చాంబర్‌లోకి నేరుగా వర్షపు నీరు వచ్చిన ఎపిసోడ్‌లో పచ్చ మీడియా పైత్యం మరోసారి బయటపడింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి జగన్‌ చాంబర్‌లోకి నీరు చొరబడింది. సచివాలయం వద్ద ఒక గోడ కూలిపోయింది.ప్ర‌తిప‌క్షాలు,ప్ర‌జ‌లు దానిమీద ఎంత విమ‌ర్శ‌లు చేస్తున్నా ఎక్క‌డా కూడా దానికి సంబ‌దించిన‌వార్త ప‌చ్చ‌మీడియా చాన‌ల్ల‌లో క‌నీసం స్క్రోలింగ్‌కూడా పెట్ట‌లేదు.
స‌చివాల‌యం రెవిన్యూ కార్యాల‌యంలోకి వ‌చ్చినా ఒక‌టి రెండు చాన‌ల్లు మిన‌హా మిగితా ఛాన‌ల్ల‌న్ని త‌డిగుడ్డ‌వేసుకొని మాకేం అన్న‌ట్లు నిద్ర‌పోతున్నాయి.సింగపూర్‌కు చిన్న తమ్ముడి లాంటి సింగావతిలో ఇంత దారుణం జరిగిపోతున్నా ఒకటి రెండు చానళ్లు మినహా మిగిలిన చానళ్లు అన్ని ముసుగేసుకుని మూసుకుని కూర్చున్నాయి. కొన్ని చానళ్లు అయితే కనీసం స్కోలింగ్ కూడా ఇవ్వలేదు. మరుసటి రోజు ఆ రెండు పత్రికల్లో అసెంబ్లీలో లీకేజ్‌పై చిన్న వార్త కూడా లేదు.

{loadmodule mod_custom,GA2}

అదే మ‌రుస‌టిరోజు అసెంబ్లీ స్పీక‌ర్ ప‌రిశీలించ‌డానికి వెల్లి ఎవ‌రో జ‌గ‌న్ చాంబ‌ర్‌లోకి వెల్లే పైపును ఎవ‌రో క‌ట్ చేశార‌ని అమాత్యులు సెల‌వివ్వ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు నిద్ర‌పోయిన ప‌చ్చ‌మీడియా ఛాన‌ల్లు కెమెరాల‌ను తీసుకొని ఎగ‌రేసుకుంటూ వెల్లాయి.సాయంత్రానికే ఆచాన‌ల్లు అన్ని దానిపైన కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేశాయి.
గన్‌ చాంబర్‌లోకి నీరు రావడం వెనుక వైసీపీ కుట్ర ఉందన్న అభిప్రాయం కలిగేలా కథనాలు వేయడంతో పాటు… చర్చ కార్యక్రమాలకు వచ్చిన వారి నుంచి కూడా బలవంతంగా అదే అభిప్రాయాన్ని పిండుకునేందుకు పాకులాడాయి. పైగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే టీవీ ఛానళ్లు చర్చను కేవలం జగన్‌ చాంబర్‌ వరకు మాత్రమే పరిమితం చేశాయి. ఇది మ‌న ప‌చ్చ‌మీడియా ఛాన‌ల్ల య‌వ్వారం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -