Friday, May 3, 2024
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ని దివాళా తీయిస్తోన్నది చంద్రబాబు ప్రభుత్వమేనా….?

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అప‌రిచితునిలాగా త‌యార‌య్యారు. ఆయ‌న ఎప్పుడు ఏది మాట్లాడ‌తాడో ఎవ‌రికీ అర్థం కావ‌డంలేదు. చివ‌రికి త‌న‌కే అర్థ‌మ‌వ‌తుందా అనేది ఆయ‌న‌కె తెలియాలి. రాష్ట్రాభివృద్దికి ప్ర‌తిప‌క్షం అడ్డుప‌డుతోంద‌ని ప‌దే ప‌దే నిత్యం జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌నే చేస్తుంటారు. జ‌నాల మైండ్‌లోకి బాగా ఎక్కించేశారు. అస‌లు విష‌యానికి వ‌ద్దాం..!

చంద్ర‌బాబు చెబుతున్న‌ట్లు ఏపీ లో ప్ర‌తిపిక్షం వైసీపీ నా..? లేకా భాజాపా నా ..? రాజధానిని అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. నిజానికి రాజధానికి అడ్డుపడుతున్నది ఎవ‌రో కాదు స్వయానా చంద్రబాబే. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీ పోషిస్తున్నది చంద్ర‌బాబెనా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

2018 క‌ల్లా రాజ‌ధాని మొద‌టి నిర్మానం పూర్తి చేస్తామ‌ని చెప్పి ఇప్ప‌టికి దాదాపు నాలుగు సంవ‌త్స‌రాలు కావ‌స్తోంది. ఇదిగో ప్ర‌పంచ రాజ‌ధాని..అని మూడున్న‌ర సంవ‌త్స‌రాల‌నుంచి ప్ర‌జ‌ల‌కు అర‌చేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. దీనిపై ప్ర‌శ్నిస్తే జ‌గ‌న్ అడ్డుప‌డుతున్నాడ‌ని వైసీపీ మీద నెపం వేస్తారు. అధికారంలోకి వ‌చ్చిన్ప‌టినుంచి ఇదే తంతు కొన‌సాగిస్తున్నారు.

రాజధాని అమరావతికి సంబంధించి జపాన్‌ సంస్థ ‘మాకీ’కి మకిలి పట్టించింది సాక్షాత్తూ చంద్రబాబే. ఆ తర్వాత చాలా సంస్థలొచ్చాయి.. అవన్నీ అడ్రస్‌ లేకుండా పోయాయి. సింగపూర్‌ సంస్థలేమయ్యాయో చంద్రబాబుకే తెలియాలి. ఇప్పుడు తాజా బాధితురాలు నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థ. ఇవన్నీ డిజైన్లు ఇవ్వడం, వాటిని చెత్త డిజైన్లుగా చంద్రబాబు తేల్చేయడం.. చెత్త డిజైన్ల కారణంగా రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమవుతుండడం.. వెరసి, ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందాన త‌యార‌య్యింది.

మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ‘దివాళా’ దిశగా అడుగులు వేస్తోంద‌ని సాక్షాత్తు ఆర్థ‌క మంత్రి య‌నుమ‌ల సెల‌విస్తారు. ఆదాయార్జనలో ముఖ్య శాఖలు తగిన పనితీరు చూపడంలేదని స్వయంగా ముఖ్యమంత్రి గుస్సా అవుతున్నారు. అంటే, దానర్థమేంటి.? ఆంధ్రప్రదేశ్‌ని దివాళా తీయిస్తోన్నది చంద్రబాబు ప్రభుత్వమే అనుకోవాలి.

కేంద్రం నుంచి 13 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి నిధులు రావాల్సి వుందని. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినా, దాన్నీ అమలు చేయడంలేదని చంద్రబాబు మండిపడ్డారు. అంటే, ఇక్కడ మిత్రపక్షం బీజేపీ కూడా ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందన్నది చంద్రబాబు వాద‌న‌. ఇక్క‌డేమొ క‌ల‌సి కాపురం చేస్తారు..కేంద్రంపై మాత్రం నిద‌లు వేస్తారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి కాద‌నె విష‌యం అంద‌రికి తెలిసిపోయింది. ఇప్పుడు పోల‌వ‌రం నిర్మాన‌సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌పై అస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ సంస్థకు అంత పెద్ద ప్రాజెక్టు నిర్మించే ‘సామర్థ్యం’ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నాన్సెన్స్‌..’ అని అప్పట్లో ఆ విమర్శల్ని కొట్టి పారేసిన చంద్రబాబే, ఇప్పుడు ఆ ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థలపై మండిపడిపోతున్నారు. చంద్రబాబుకి అర్థమవుతోందో లేదో, ఆయన ‘అపరితుడు’ తరహాలో వ్యవహరిస్తున్నారని.

బాబు అనుస‌రిస్తున్న విధానాలు చూస్తె ఏపీ అభివృద్దికి అడ్డుప‌డుతుండేదానికి వేరే శ‌త్రువులు అక్క‌ర్లేదు .. అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ అని డప్పు కొట్టుకునే ‘నిప్పు’ నారా చంద్రబాబునాయుడేనని అనుకుంటారు ప్ర‌జ‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -