Sunday, May 5, 2024
- Advertisement -

అంతర్జాతీయంగా పాక్ కు మరో సారి పరాభవం…

- Advertisement -

కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా పాక్ ఎన్నిసార్లు పరాభావాలు ఎదురయినా తన బుద్దిని మాత్రం మార్చుకోవడంలేదు. తాజాగా మరోసారి పాక్ కు అవమానం ఎదురయ్యింది. కాశ్మీర్ అంశంలో భారత్‌ను బూచీగా చూపే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-సాధన అనే అంశంపై మాల్దీవులో జరిగిన దక్షిణాసియా దేశాల స్పీకర్ల సదస్సు జరుుగతోంది.

ఈ సదస్సులో కాశ్మీర్‌ అంశాన్ని దయాది లేవనెత్తే ప్రయత్నం చేయగా భారత్‌ ధీటుగా బదులిచ్చింది.పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిమ్‌ సురీ మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొన్నారు.కశ్మీరీల అణచివేతను తాము సహించేది లేదన్నారు. దీంతో సభలో నిరసనలు మొదలయ్యాయి.

పాక్‌ తీరుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఫైరయ్యారు. తమ అంతర్గత అంశాన్ని ప్రస్తావించి, ఈ వేదికను రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ సదస్సు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఉద్దేశించినదని, పాక్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది.

వెంటనే పాకిస్థాన్ మరో ప్రతినిధి వాదనకు దిగడంతో ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న మాల్దీవుల స్పీకర్‌ ఆమెను అడ్డుకున్నారు. చివరికి పాక్‌ లేవనెత్తిన అంశాలన్నీ రికార్డుల నుంచి తొలగించాల్సి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -