Friday, April 26, 2024
- Advertisement -

వారణాసీలో పర్యటించిన ప్రధాని

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించారు. యూపీలోని వారణాసీలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని ప్రారంభించారు. కశీ అందాలు, గంగా నదిని కలుపూ నిర్మించిన కారిడార్‌ను ప్రధాని ప్రజలకు అంకితం చేశారు.

గంగా నదిలో స్నానంచేసిన ప్రధాని కారిడార్‌ పనుల్లో పాలు పంచుకున్న వారిపై పూలు చల్లారు. ప్రతీ కార్మికుడి ఫలితం ఇప్పడు మన ముందు ఉన్న అందమైన నగరమని ఆయన కార్మికులను కొనాయాడారు. వారణాసీ ప్రజలు, ప్రభుత్వ ఆఫీసర్లతో కలిసి కార్మికులు ఈ నగరాన్ని అందంగా తీర్చి దిద్దారని ప్రధాని తెలిపారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న అనేక నగరాలను పట్టించుకోని ప్రధాని.. ఒక్క ఉత్తర ప్రదేశ్‌ అభివృద్ధికి మాత్రమే కృషి చేస్తున్నారని, ఆ రాష్ట్రంలో బీజేపీ పాలన కొనసాగుతుంది కాబట్టే కేంద్ర ప్రభుత్వం యూపీపై శ్రద్ద పెట్టిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కరోనా కొత్త భూతం ఒమైక్రాన్‌ దేశంలో విబృంభిస్తున్న వేళా ప్రధాని యూపీలో పర్యటించి అక్కడి ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్‌ తమిళ బాట?

బీజేపీ వ్యూహాత్మక విజయం సాధించిందా..?

అప్పటి వరకు ఎందుకు ఇప్పుడు చూపించు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -