Thursday, April 25, 2024
- Advertisement -

చైనా అధ్యక్షుడికి నో రిటైర్మెంట్ ..?

- Advertisement -

ప్రపంచ దేశాలన్నిటిలోకేల్లా అగ్రదేశాల జాబితాలో చైనా కచ్చితంగా ఉంటుంది. ఆ దేశం ఆర్థిక వ్యవస్థలోను, టెక్నాలజీ పరంగాను, అన్నీ విధాలుగా అభివృద్ది చెందిన దేశంగా ఉంది. అయితే ఆ దేశం అభివృద్ది పథంలో దూసుకుపోవడానికి కారణం దేశాన్ని ముందుకు నడిపించే నాయకత్వం..ప్రస్తుతం ఆ దేశానికి షీ జిన్ పింగ్ అధ్యక్షుడిగా ఉన్నారు. గత పదేళ్ళు గా ఆయన చైనాను తనదైన పాలనతో నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన రిటైర్మెంట్ పై ప్రపంచ మీడియా లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే తాజాగా జిన్ పింగ్ 69 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.

అయితే సాధారణంగా చైనాలో 68 ఏళ్ళు పూర్తి అయిన తరువాత లేదా రెండు దఫాలుగా ఐదేళ్లకు ఒకసారి అధ్యక్ష పదవిలో కొనసాగక రిటైర్మెంట్ ప్రకటించడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. జిన్ పింగ్ కు ముందు వున్న అధ్యక్షులందరూ కూడా ఈ ఆనవాయితీ ని కొనసాగించారు. అయితే జిన్ పింగ్ విషయంలో మాత్రం ఈ ఆనవాయితీ బ్రేక్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ( సీపీసీ ) అత్యంత శక్తివంతమైన నేతగా జిన్ పింగ్ ఈ ఏడాదితో చైనా అధ్యక్షుడిగా పదేళ్ళు పూర్తి చేసుకొనున్నారు. అంతే కాకుండా మూడవసారి అధ్యక్షుడిగా కొనసాగడానికి కూడా సిద్దమౌతున్నారు. ఎందుకంటే సీపీసీ ఆయనకు పార్టీలో అత్యంత కీలక నేత హోదాను కట్టబెట్టింది.

దాంతో సీపీసీ తరుపున మరోసారి అధ్యక్ష పదవి రేస్ లో జిన్ పింగ్ ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా చైనా చట్ట సభ ” నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ” 2018 లో రాజ్యంగా సవరణ చేసి రెండు దఫాల అధ్యక్ష పదవి కాల పరిమితిని ఎత్తివేసింది. దీంతో పార్టీ అధినేతగా, దేశ అధ్యక్షుడిగా జిన్ పింగ్ జీవితకాలం కొనసాగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీంతో చైనాలో 68 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత కూడా ఎలాంటి రిటైర్మెంట్ లేకుండా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న ఒకే ఒక్కడు షీ జిన్ పింగ్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

భారత్ అంటే రష్యాకు ఎంత ప్రేమో !

ఉక్రెయిన్ అమెరికా ను నమ్మడం లేదా ?

కృత్రిమ మానవులు వచ్చేస్తున్నారోచ్ ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -