Sunday, May 5, 2024
- Advertisement -

9 కోట్లు విలువైన పామును స్వాధీనం ..దాని ప్ర‌త్యేక‌త‌లేంటో తెలుసా..?

- Advertisement -

పామును లక్షలు పోసి కొనేవాళ్లు ఉంటారంటేనే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే వాటి విషాన్ని కొన్ని ర‌కాల ఔష‌ధాల్లో ఉప‌యోగిస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. అలాంటిది అలాంటిది ఏకంగా రూ. 9 కోట్ల విలువైన పాములు ఉన్నాయంటే మీరు న‌మ్ముతారా….? ఇది విన‌నాక న‌మ్మి తీరాల్సిదే.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా ప్రాంతంలో మాత్రమే అతిఅరుదుగా కనిపించే తక్షక్ పాముకు అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 9 కోట్ల విలువ ఉంటుంది. దీన్ని స్మ‌గ్లింగ్ చేస్తున్నకోల్‌కతాకు చెందిన ఇషా షేక్‌ ఓ వ్య‌క్తిని ప‌శ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసి….సామును స్వా ధీనం చేసుకున్నారు.

అత‌నికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్‌ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో తక్షక్‌ పామును వారికి అమ్మేందుకు 9 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్‌ ప్రకారం జార్ఖండ్‌కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగును పరిశీలించిగా పాము కనిపించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇషా షేక్‌పై అనుమానంతో అతని బ్యాగ్ చెక్ చేసిన పోలీసులకు పాము కనిపించింది. విచారించగా అసలు విషయం బయటికి వచ్చింది. జార్ఖండ్‌లో ఇద్దరు స్మగ్లర్లకి పామును అందించేందుకు వెళ్తున్నానని చెప్పాడు షేక్. పామును రూ. 9 కోట్లను బేరం పెట్టానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ కలియాచాక్ అడవుల్లో కనిపించే ఈ పాములు అత్యంత విషపూరితమైనవి. చూడడానికి చిన్న బల్లిలా ఉండే తక్షక్ పాములు… చిటికెలో మనిషి ప్రాణాన్ని తీయగలవు. వీటి నుంచి సేకరించిన విషాన్ని పలు రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -