- Advertisement -

గురువుకు గొప్ప బ‌హుమ‌తి ఇచ్చిన మోదీ….

- Advertisement -
BJP Hand to L K Advani in presidential election

పువ్వునే నమ్ముకున్నందుకు అద్వానీజికి అ పువ్వునే చేతిలో పెట్టారు..అవునులే అ రాముడినే మోసం చేసిన పార్టీకి అద్వానీజి లాంటివారు ఎలా పనికివస్తారు.అద్వానీజి లౌకికివాది కాదట,మతవాది అట.90వ దశకంలో రాముడు ,రధయాత్రలు లేకపోతే ఈ కాషాయపార్టీ ఎక్కడికి పోయెదో క‌మ‌ళ‌ద‌లం మ‌రోసారి ఆలోచించాలి.

అయనకు తెలిసింది ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం,నిర్మోహమాటంగా మాట్లాడటం,రాజకీయాలు తెలియకపోవడం.ఇదే తప్పా.ప్రజలు,పార్టీ అలోచిస్తుంది.రామాలయం లేని ఊరు ఎలా ఉండదో, అడ్వాణీజి లేని బీజేపీ ఉండదు.

{loadmodule mod_custom,GA1}

1990 ద‌శ‌కం. దేశమంతా ఒకరకమైన వేడి వాతావరణం.. కొందరికి నెత్తురు ఉడుకుతోంది.. మ‌రి కొంద‌రి కడుపు రగులుతోంది.. దేశ‌మంతా ఒక‌టే టెన్స‌న్‌. మరోచోట తుఫాను ముందు ప్రశాంతతలా.. ఇంకోచోట ఉత్సాహంగా.. ఉంది. ఈ పరిస్థితికి కారణం అద్వానీయే. ఉత్తర భారతదేశంలోని ఒక ఊరిలో.. కాషాయధ్వజాలు రెపరెపలాడుతుండగా రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర కాశీ నుంచి కన్యాకుమారి వరకు.
రథయాత్ర సమయంలో అద్వానీ పిడికిళ్లు బిగిస్తూ ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోయేలా మాట్లాడుతున్నారు. గొంతులో గాంభీర్యం. మాటలో స్పష్టత. శాసించే అధికారం ఎప్పుడెప్పుడా అని ఆయన తలలో ఆలోచనలు మండుతున్నాయి. ముఖ్యంగా తన గురువు అద్వానీని రాష్ట్రపతి చేసి ఆయన రుణం తీర్చుకుంటాను అన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఎన్నికల హామీలా మిగిలిపోయాయి.
1984లో కేవలం రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఆ తర్వాత అద్వానీ చేప‌ట్టిన ర‌థ‌యాత్ర‌తో 85 మంది ఎంపీల పార్టీగా అవతరించింది. 1992 డిసెంబర్ 6వ తేదీన మహావిధ్వంసం. బాబ్రీ మసీదు కూల్చివేత. అద్వానీ పేరు దేశమంతా మార్మోగిపోయింది. 1996 జరిగిన ఎన్నికల్లో మహారథిని ప్రధానిని చేసే స్థాయిలో కాషాయదండు గెలవలేపోయింది. అద్వానీ ప్రియమిత్రుడు అటల్‌ బిహారీ వాజపేయి ప్రధాని అయ్యారు.
ఐదేళ్లు భారంగా గడిచిపోయాయి. మళ్లీ ఎన్నికలు. మళ్లీ ఓటమి. తదుపరి ఐదేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గుజరాత్ ప్రకంపనలు హస్తినకు చేరాయి. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం అద్వానికి ఇస్టంలేదు.. అయినా మంకుపట్టు పట్టారు.. కంటతడి పెట్టుకున్నారు.. కారాలూ మిరియాలూ నూరారు.. కానీ, అవేవీ మోడీ కరిష్మా ముందు పనిచేయలేదు.

{loadmodule mod_custom,GA2}

సంకీర్ణ శకంలో.. బంపర్‌ మెజారిటీ సాధించి ఒంటిచేత్తో కాషాయ ధ్వజాన్ని దేశవ్యాప్తంగా రెపరెపలాడించారు నరేంద్ర మోడీ. ‘ఇంత సాధించిన మోడీకి కృతజ్ఞతలు’ అని అద్వానీ అనడం.. దానికి మోడీ కన్నీరు పెట్టుకోవడం.. గురు-శిష్యుల అనుబంధానికి ప్రతీకగా నిలిచింది.
నిజంగా బీజేపీ కోసం అద్వానీ ఎన్నో చేశారు. ఎంతో కష్టపడ్డారు. తన జీవితాన్ని ధారపోశారు. మిత్రుడి కోసం ప్రధాని పదవినీ త్యాగం చేశారు. నాడు రథయాత్రలో అద్వానీ పక్కన ఉండి సేవలు చేసిన వ్యక్తి.. ఆయన కనుసన్నల్లో పనులు చక్కబెట్టిన మనిషి.. ఆయన మాటతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి.. కష్టకాలంలో ఆ కురువృద్ధుడు ఎవరికి అండగా నిలిచారో… ఆ వ్యక్తే నేడు మేకయ్యాడు .
ఒకప్పుడు మహారథిగా వెలుగొందిన లాల్ కృష్ణ అద్వానీ ఇపుడు అంపశయ్యపై పరుండిపోయాడు. పార్టీ కోసం జీవితాన్ని ధారపోస్తే.. చివరికి మిగిలింది కన్నీరే. మోడీతత్వం ముందు అద్వానీ హవా పని చేయలేదు. మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఫలితంగా వృద్ధాప్యంలో సర్వస్వం కోల్పోయి నిస్సహాయుడిగా మిగిలిపోయారు భాజాపా కుర‌వృద్ధుడు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}H70hXihAEhU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -