Friday, May 24, 2024
- Advertisement -

అవ‌స‌రం అయితే ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తాం….భాజాపా..

- Advertisement -

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. తాజాగా భాజాపానేత పురందేశ్వ‌రి చంద్ర‌బాబుకు వార్నింగ్ ఇచ్చారు.

రిపాలన విషయంలో తప్పులు చేస్తున్న టీడీపీ… ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు 80 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని… అయినా, ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను అందించడం లేదని ఆమె అన్నారు.

మిత్రపక్షమైన టీడీపీ ఇలాగే వ్యవహరిస్తూ పోతే.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ సామర్థ్యాన్ని బట్టి బీజేపీ పోటీ చేస్తుందని ఆమె హెచ్చరించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒడిశా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అడ్డంకిగా మారాయని స్పష్టం చేశారు. గత డిసెంబరులోనూ పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలంటూ పురంధేశ్వరి ఆరోపించారు.

కేంద్రానికి సరైన లెక్కలు పంపకుండానే అవసరమైన నిధులు విడుదల చేయటం లేదని కేంద్రంపై నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. టిడిపి తమకు ప్రతిపక్షమా? మిత్రపక్షమా? అనేది ముఖ్యం కాదని, సరైన లెక్కలు పంపటం లేదన్నదే తమ పాయింటన్నారు. కేంద్రానికి సరైన లెక్కలు పంపితే తక్షణమే కేంద్రం నిధులు ఇస్తుందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -