Wednesday, April 24, 2024
- Advertisement -

ఆ సర్వే ఫలితాలు జగన్ కు హెచ్చరికే ?

- Advertisement -

ఆంద్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారం చేపట్టినది మొదలుకొని ఇప్పటివరకు కూడా లెక్కకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఇది ఎవరు కాదనలేని విషయం. అయితే ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో చేరుతున్నాయా ? అంటే చెప్పడం కష్టం. అమ్మ వొడి, వాహన మిత్రా, రైతు భరోసా, వైఎస్ ఆర్ ఆసరా.. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన దాదాపు అన్నీ పథకాలు కూడా నగదు పంపిణీ పథకాలే కావడంతో అర్హులైన చాలమంది ప్రజలకు ఆ పథకాలు చేరడం లేదని వాపోతున్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం మూడు సంవత్సరాలలో 32 పథకాలు చేశామని గర్వంగా చెప్పుకుంటున్నారు. .

అమలు చేయడం సంగతి అలా ఉంచితే క్షేత్ర స్థాయి వరకు ఆ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా ? లేదా అని పర్యవేక్షించడంలో జగన్ సర్కార్ విఫలం అయిందనే చెప్పాలి. అంతే కాకుండా కేవలం పథకాలపైనే దృష్టి పెడుతూ జగన్ అభివృద్దిని గాలికి వదిలేశారని గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. ఇక జగన్ అధికారం చేపట్టిన తరువాత నిత్యవసర ధరలు పెరుగుదల, విపరీతమైన కరెంటు కోతలు, తీవ్రమైన ఆర్థిక లోటు, వంటి చాలా అంశాలు జగన్ పరిపాలనపై వ్యతిరేకత చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాలలో జగన్ పరిపాలనపై ప్రజాభిప్రాయాలను సేకరించేందుకు సర్వే నిర్వహించిన ఇండియా టుడే షాకింగ్ విషయాలను వెల్లడించింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ 19 సీట్లు గెలుచుకోవచ్చని ఇండియా టుడే సర్వేలో తెలిపింది. ఇక టీడీపీ 6 సీట్లు సాధించవచ్చని తెలిపింది. అయితే 2019 ఎన్నికల ముందు ఇదే విధంగా సర్వే నిర్వహించిన ఇండియా టుడే.. అప్పుడు వైసీపీ కి 23 సీట్లు, టీడీపీ 3 సీట్లు వస్తాయని సర్వేలో తెలిపింది. కానీ ఇప్పుడు వెల్లడించిన సర్వే ఫలితాల్లో వైసీపీ 19 సీట్లకు తగ్గిపోయింది. దీన్ని బట్టి చూస్తే వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమౌతుంది. ఇక టీడీపీ కి గత సర్వేతో పోలిస్తే ఈ సారి 3 సీట్లు పెరగడంతో ఆ పార్టీ మళ్ళీ పుంజుకుంటోంది అని చెప్పవచ్చు. అయితే ఈ సర్వేలో జనసేన ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఏది ఏమైనపటికి గత ఎన్నికల్లో 151 సీట్లను కైవసం చేసుకున్నా వైసీపీ ఈ సారి మాత్రం ప్రజావ్యతిరేకతను ఎదుర్కొనక తప్పదేమో మరి.

Also Read

“కాపు నేస్తం” రేపిన చిచ్చు ..!

ఈటెల కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి ?

బీజేపీ “ఆకర్ష్” ను.. టి‌ఆర్‌ఎస్ అమలు చేస్తోందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -