మోడీ తలుచుకుంటే.. జగన్ వెనక్కు తగ్గుతాడా ?

అమరావతి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే.. వైఎస్ జగన్ వెనక్కు తగ్గే అవకాశం ఉందా అంటే అవుననే వాదనలను విశ్లేషకులు వినిపిస్తున్నారు. దీని గురించి కాస్త వివరంగా చర్చించుకుందాం.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రస్తావనను తీసుకొచ్చారు సి‌ఎం జగన్. అమరావతిని లెజిస్ట్రేటివ్ రాజధానిగాను, విశాఖా ను పాలన రాజధానిగాను, కర్నూల్ ను న్యాయ శాఖ రాజధానిగాను ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్ ఆలోచన. అయితే ఈ మూడు రాజధానుల విషయంలో పోలిటికల్ గా అన్నీ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఇప్పటికీ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. .

అయినప్పటికి మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జగన్ సర్కార్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే అమరావతి రైతులకు అండగా ఉంటామని ఇటీవల ఏపీ బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అమరావతి నుంచి రాజధాని మార్పు జరగదని కూడా భరోసా ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ఎలా ఉన్నప్పటికి కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహిత్యం కనబరున్నారు సి‌ఎం జగన్. అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వ తీరుపై కాస్త విమర్శలు చేస్తున్నప్పటికి ఎక్కువ శాతం కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రయత్నమే చేస్తున్నారు జగన్. ఈ నేపథ్యంలో అమరావతినే పూర్తి రాజధానిగా కొనసాగించే విధంగా నరేంద్ర మోడీ, లేదా అమిత్ షా జోక్యం చేసుకుంటే వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందని కొందరి వాదన.

ఎందుకంటే గతంలో పరోక్షంగా బీజేపీ అధిష్టానం కోరిక మేరకు గంగవరం పోర్ట్ లోని ప్రభుత్వ ఆస్తులను ఆధాని కి సి‌ఎం జగన్ అమ్మేసిన విషయాన్ని ఉదాహరణగా చెబుతున్నారు విశ్లేషకులు. దీన్ని బట్టి చూస్తే కేంద్రానికి సంభందించిన ఏ నిర్ణయాన్ని కూడా జగన్ వ్యతిరేకించే పరిస్థితిలో లేడని పలువురి అభిప్రాయం. అయితే మూడు రాజధానుల విషయాన్ని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలని ఇటీవల కేంద్రం తెలిపింది. అయితే ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం.. జగన్ సర్కార్ కు సూచిస్తే.. మూడు రాజధానుల విషయంలో జగన్ వెనక్కి తగ్గే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Also Read

నేతలు మారితే.. ఓటర్లు మారరు గురూ !

ఆ విషయంలో.. మాట తప్పిన మోడీ !

మళ్ళీ టీడీపీ జట్టుతో బీజేపీ.. కలుస్తోందా ?

Related Articles

Most Populer

Recent Posts