Thursday, March 28, 2024
- Advertisement -

మోడీకి చెక్ పెట్టేందుకు కేజ్రివాల్ మాస్టర్ ప్లాన్ !

- Advertisement -

ప్రస్తుతం అరవింద్ కేజీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మరికొన్ని రాష్ట్రాలపై కూడా గట్టిగానే ఫోకస్ చేస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఆప్.. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల తరువాత ప్రత్యామ్నాయ జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీని నిలిపేందుకు అరవింద్ కేజ్రివాల్ పక్కా ప్రణాళికలతో ముందుకు కదులుతున్నారు. ఇక ఈ ఏడాది చివర్లోనూ, అలాగే వచ్చే ఏడాదిలోను గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలపై కేజ్రివాల్ గట్టిగానే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ..

ముఖ్యంగా ప్రధాని మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో పాగా వేయాలని కేజ్రివాల్ ఉవ్విళ్లూరుతున్నారు. ఎందుకంటే ప్రధాని సొంత రాష్ట్రంలోనే బిజెపికి చెక్ పెడితే దేశ వ్యాప్తంగా ఆప్ విస్తరణ సులభతరం అవుతుందని కేజ్రివాల్ ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రజలకు లెక్కకు మించి వారాలు ప్రకటిస్తున్నారు. గిరిసోమ్ నాథ్ జిల్లాలోని నెరవేలి లో నిర్వహించిన భాహిరంగ సభలో కేజ్రివాల్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, అలాగే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3 వేల రూపాయల నిరుద్యోగభృతి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఉచిత నీరు, ఉచిత విద్యుత్ ( 300 యూనిట్ల వరకు ) ఇస్తామని, అలాగే గుజరాత్ లో డిల్లీ మోడల్ విద్యా ప్రవేశ పెడతామని ప్రకటించారు.

ఇక ఈ ఏడాది చివర్లో గుజరాత్ లోని 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ 10 స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంచితే ఒకవైపు ఉచిత పథకాలు వద్దు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొస్తుంటే.. మరోవైపు కేజ్రివాల్ ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఉచిత హామీల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా ఉచిత హామీల ద్వారా డిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలలో అధికారం చేపట్టిన కేజ్రివాల్.. గుజరాత్ ప్రజలకు కూడా పలు ఉచిత హామీలను ప్రకటిస్తూ.. మోడీ సొంత రాష్ట్రంలో ఆయనకు చెక్ పెడతారేమో చూడాలి.

More Like This

మోడీజీ.. దేశ భక్తి అంటే ఇదేనా ?

ఆ విషయంలో.. మాట తప్పిన మోడీ !

మోడీ-షా నెక్స్ట్ టార్గెట్ ఆదేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -