Wednesday, May 8, 2024
- Advertisement -

బాబుగారి బండారం బయటపెట్టిన కాగ్….. రోజువారీ ఖర్చులకు లక్షా ఇరవై వేల కోట్లు హరీ

- Advertisement -

2004లో వైఎస్ అధికారంలోకి వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ ఆర్థికలోటుతో కునారిల్లుతూ ఉన్నది. అదీ నాడు చంద్రబాబు సాధించిన వాస్తవిక అభివృద్ధి. హైటెక్ సిటీ లాంటి వాటిని చూపించి వ్యవసాయంతో సహా ఇతర రంగాలన్నింటినీ పూర్తిగా కునారిల్లిపోయేలా చేశాడు చంద్రబాబు. ఆ తర్వాత వైఎస్ పదవీకాలం అయిపోయేనాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ని లక్ష కోట్లు దాటిపోయేలా చేసిన ఘనత వైఎస్‌ది.

ఇప్పుడు 2014 నుంచీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా లక్ష కోట్లు దాటించేశాడు. దాటించడమే కాదు ఏకంగా లక్షా ఇరవై వేల కోట్లకు తీసుకుపోయాడు. ఏడు దశాబ్ధాల్లో సాధ్యం కాని దాన్ని చంద్రబాబు కేవలం మూడున్నరేళ్ళలో సాధించేశాడు. విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 97వేల కోట్లు. మూడున్నరేళ్ళ తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులు 2.16 లక్షల కోట్లు. అంటే ఏడు దశాబ్ధాల కాలంలో సీమాంధ్ర అప్పు 97వేల కోట్లు అనుకుంటే మూడున్నరేళ్ళలో చంద్రబాబు చేసిన అప్పులు మాత్రం దాదాపు లక్షా ఇరవై వేల కోట్లు అన్నమాట.

అయినప్పటికీ రాజధాని నిర్మాణం శంకుస్థాపన కోసం ఒక్క ఇటుక పడలేదు. చంద్రబాబు నిర్మించిన శాశ్విత నిర్మాణం ఒక్కటీ కూడా లేదు. వ్యవస్థీకృతంగా కనిపించే అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అంటే మొత్తం లక్షా ఇరవై వేల కోట్లు కేవలం రోజువారీ నిర్వహణ కోసం వెచ్చించేశారన్నమాట. ఇలాంటి అప్పుల భారంతో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేయగలదా? ఈ అప్పులన్నీ తీర్చడం సాధ్యమేనా? బాబు ప్రచార డాంభికాలను గొప్పగా చెప్పే ఎల్లో మీడియాకు ఇలాంటి భయంకరమైన వాస్తవాలు అస్సలు కనిపించవా? ప్యాకేజీల జనసేనాని కూడా కళ్ళు మూసుకుని కీర్తించేయడమే తప్ప అప్పుల తిప్పలను చూడడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -