Friday, April 19, 2024
- Advertisement -

తేలిక‌గా తీసుకోవ‌ద్దు.. క‌రోనాపై ఎయిమ్స్‌ చీఫ్‌ వార్నింగ్‌!

- Advertisement -

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. నిత్యం ల‌క్ష‌కు పైత కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌పంచంలో క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో టాప్ ప్లేస్ దిశ‌గా దూసుకుపోతుంది. ఇప్ప‌టికే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ ను వెనక్కి నెట్టి అమెరికా త‌ర్వాత క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్న రెండో దేశంగా భార‌త్ నిలిచింది.

అయితే, దేశంలో క‌రోనా ఓ రేంజ్ లో విజృంభిస్తూ.. కొత్త క‌రోనా వేరియంట్లు పంజా విసురుతున్నప్ప‌టికీ.. క‌రోనా మ‌హ‌మ్మారిని ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ.. వైర‌స్‌ను తేలిక‌గా తీసుకుంటే దేశంలో ప‌రిస్థితి చేయిదాటిపోతుంద‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న‌ద‌ని తెలిపారు. దీనికి గ‌ల ప్ర‌ధాన కార‌ణాల్లో ప్ర‌జ‌లు కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డ‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. మార్కెట్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌లో జనం ర‌ద్దీ అధికంగా ఉంటున్న‌ద‌నీ, వీరంతా క‌రోనా సూపర్‌ స్ప్రెడర్లుగా మారుతున్నారని ర‌ణ‌దీప్ గులేరియా తెలిపారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌నీ, టీకా తీసుకోవ‌డానికి అంద‌రూ ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!

తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

హ‌రిద్వార్ కుంభ‌మేళలో అద్భుతం.. నీటిపై తేలుతున్న రాళ్లు

టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది: బండి సంజ‌య్

భారత తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -