Friday, April 26, 2024
- Advertisement -

టీకా తీసుకన్న సర్పంచ్ మృతి

- Advertisement -

తాజాగా కరోనా టీకా తీసుకున్న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం లింగంధన గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ్ రాజామోని మయూరి ఆకస్మిక మృతి చెందారు. బుధవారం రాత్రి కొద్దిగా అనారోగ్యం బారినపడటంతో వెంటనే కుంటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్తుండ‌గా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన‌ట్టు కుటుంబ సభ్యులు వెల్ల‌డించారు.

కాగా, ఈ నెల 12న ఆమె కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమే కొద్దిగా అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం రాత్రి అకస్మాత్తుగా పల్స్ పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స‌ర్పంచ్ మ‌ర‌ణంతో లింగ‌ధ‌నం గ్రామంలో విషాధఛాయ‌లు అల‌ముకున్నాయి.

అయితే, స‌ర్పంచ్ మ‌యూరి మ‌ర‌ణానికి ఆమె తీసుకున్న క‌రోనా టీకా కార‌ణ‌మా? లేదా ఆమెకు ఇదివ‌ర‌కు ఉన్న ఏమైన అనారోగ్య సమ‌స్య‌లు కార‌ణ‌మా అనేది తెలియాల్సి ఉంది. ఈ విష‌య‌మై వైద్యులు సైతం ఆరా తీసుకున్నార‌ని స‌మ‌చారం. కాగా, ఇప్పటికే టీకాపై వస్తున్న అనేక అనుమానాల వల్ల టీకా తీసుకోవడానికి ప్రజలు ముందుకురాని పరిస్థితులు పలు చోట్ల ఏర్పడుతున్నాయి. టీకా నాణ్యత పై కూడా అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

కీర‌దోస‌.. బరువు త‌గ్గించే సులువైన మార్గం..!

తేలిక‌గా తీసుకోవ‌ద్దు.. క‌రోనాపై ఎయిమ్స్‌ చీఫ్‌ వార్నింగ్‌!

నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!

తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

హ‌రిద్వార్ కుంభ‌మేళలో అద్భుతం.. నీటిపై తేలుతున్న రాళ్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -