Thursday, April 18, 2024
- Advertisement -

మళ్ళీ తెరపైకి పిఒకే.. ఈ సారి యుద్దం వస్తే !

- Advertisement -

భారత్-పాకిస్తాన్ మద్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ రెండు దేశాల మద్య ఏర్పడే ఏ చిన్న వివాదం అయిన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అది క్రికెట్ విషయంలోనైనా, ఆర్థిక వ్యవస్థలోనైనా, సైనిక వ్యవస్తఃలోనైనా ఇలా ప్రతిదాంట్లో కూడా ఈ రెండు దేశాల మద్య వైరం కొనసాగుతూనే వస్తోంది. అయితే మరోసారి ఈ రెండు దేశాల మద్య వైరానికి తెరలేవనుందా ? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల ఆర్ ఎస్ ఎస్ ప్రదాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబెలే జమ్ము కాశ్మీర్ లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

పిఒకే భారత్ లో భాగమేనని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ వైపు చూస్తున్నారని అన్నారు. అంతే కాకుండా 1947 నుంచి కాశ్మీర్ లో పాక్ అరాచకాలు కొనసాగుతున్నాయని, పాక్ దుర్మార్గలకు లలైంది పిఒకే ప్రజలేనని.. వారికి కచ్చితంగా న్యాయం జరగాల్సిందేనని దత్తాత్రేయ హోసబోలే అన్నారు. ఇదిలా ఉంచితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పిఒకే పై స్పందించడం కొత్త చర్చలకు తావిస్తోంది. ” ప్రస్తుతం భారత్ మెరుగైన స్థితిలో ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు ఉందని అన్నారు. అంతే కాకుండా ముమ్మాటికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగమేనని ” రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

దీంతో పిఒకే గురించి దత్తాత్రేయ తో పాటు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా స్పందించడంతో పిఒకే విషయం హాట్ టాపిక్ గా మారింది. దీంతో పిఒకే పై సంపూర్ణ పట్టు కోసం కేంద్రం వ్యూహాలు రచిస్తోందా ? అనే చర్చ నేషనల్ మీడియా లో జోరుగా వినిపిస్తోంది. అయితే పిఒకే విషయంలో ఈసారి ఇండియా పాకిస్తాన్ మద్య యుద్దం వస్తే కచ్చితంగా పిఒకే పై ఇండియా పట్టు సాధిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పిఒకే విషయంలో భారత్ చాప కింద నీరులా వ్యూహాలు రచిస్తోందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ముందు రోజుల్లో పిఒకే విషయంపై కేంద్రం వైఖరి త్వరల్నే తెలిసే అవకాశం ఉంది.

Also Read

చైనా భారత్ ను ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

శ్రీలంక పరిస్థితి మనకు కూడా.. కేంద్రం స్పష్టత ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -